గుడివాడ టౌన్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు సీఎం జగన్ కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలతో ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారని పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో రూ.10.28 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి బ్లాక్–2 భవనాన్ని ఆమె ప్రారంభించారు.
తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైఎస్సార్ జయంతి రోజున 100 పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలో ఒక చరిత్ర సృష్టించిందన్నారు.
పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలందించాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సేవలందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ వైద్య రంగం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గతంలో ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు ఇబ్బందులు పడేవారని వివరించారు.
తాము అధికారంలోకి రాగానే ఆస్పత్రి దుస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 22మంది వైద్యులు, 80 మందికి పైగా నర్సులు, ఇతర సిబ్బందితో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment