
సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాల వేస్తున్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు, మహిళలు
తాడికొండ: తనపై పడిన కుల రాజధాని ముద్రను తొలగించుకొనేందుకే చంద్రబాబు రాష్ట్రంలో ఆలయాలపై టీడీపీ నాయకులతో దాడులు చేయించి తిరిగి అదే ఆలయాల చుట్టూ ప్రేమ పొంగినట్టు చెప్పులతో మెట్లెక్కి ప్రదక్షిణలు చేస్తున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 96వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.
పేదలకు అండగా 31 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు 15 లక్షల ఇళ్లు ప్రారంభించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఆదివారం చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మాదిగాని గురునాథం, కట్టెపోగు ఉదయ్‌భాస్కర్, రుద్రపోగు సురేష్, రాజేంద్ర కుమార్, నిక్కిరాల మురళీ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment