
రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న సమితి నాయకులు
తాడికొండ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో భూకుంభకోణాలు, మోసాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడిన టీడీపీ అధినేత చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టే సమయం ఆసన్నమైందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. ఏపీలో రైతులు, పేదలను మోసం చేసి పెద్దల గద్దలకు పంచిన రాజధానిలో జరిగిన భూ కుంభకోణం, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తప్పించుకునే అవకాశమే లేదని వారు స్పష్టం చేశారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా 93 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో గురువారం పలువురు దళిత నేతలు ప్రసంగించారు. రాజధానిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబుకు వచ్చే నష్టమేమిటో తెలపాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment