మాట్లాడుతున్న ఏడుకొండలు
తాడికొండ: నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల అభివృద్ధిని వదిలి.. కుల రాజధాని నిర్మాణానికి తన బినామీల కోసం దొంగ దీక్షలు చేయించడంలో ఆంతర్యం ఏమిటో చంద్రబాబు చెప్పాలని యానాది సంఘం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల ఏడుకొండలు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 39 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మూడు రాజధానులకు సంఘీభావం తెలుపుతున్న మహిళలు, దళిత సంఘాల ప్రతినిధులు
పూలింగ్ పేరుతో రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు శనిలా మారి ఒకే రాజధాని అంటూ తన బినామీల కోసం రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడన్నారు. సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని గ్రాఫిక్స్‌లో బొమ్మలు చూపించిన ఆయన కార్పొరేట్ సంస్థలకు విలువైన భూములను ధారాదత్తం చేసి రైతులకు మొండిచేయి చూపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, వికలాంగుల సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బందెల కిరణ్‌రాజు, ఏపీ మాల మహానాడు అధ్యక్షుడు యోనారాజు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment