సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ఉద్యోగులను అనేక రకాలుగా వేధిస్తోంది. దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు యాజమాన్యం నుంచి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల అలవెన్స్‌లు, హెచ్‌ఆర్‌ఏను యాజమాన్యం తొలగించింది. అలాగే, దాదాపు 500 మంది ఉద్యోగులను నాగర్ నగర్ స్టీల్ ప్లాంట్‌కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న దాదాపు 3000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోంది. మరోవైపు.. వీఆర్‌ఎస్ పేరుతో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ప్రయత్నాలు అన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగమేనని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
ఇక, ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మూసివేత కారణంగా 455 మంది శాశ్వత, 2500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మొదపకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కార్మికులు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల ఆరాచకం.. వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపై దాడి
Comments
Please login to add a commentAdd a comment