సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉద్యోగుల జీతాల విషయంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. ఈనెల 15వ తేదీ వచ్చినా కార్మికులకు ఇంకా జీతాలు అందలేదు. ఇక, గత రెండు నెలలుగా వారికి కేవలం సగం కన్నా తక్కువ జీతాలే ఇస్తున్నారు.
విశాఖ ఉక్కు కార్మికులకు జీతాలు ఇంకా అందలేదు. డిసెంబర్ నెలకు సంబంధించిన 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ నెలలో 50 శాతం, సెప్టెంబర్ నెల జీతం 35 శాతం మాత్రమే యాజమాన్యం చెల్లించింది. ఇప్పటికే పెండింగ్ జీతాలపై యాజమాన్యం ఊసే ఎత్తకపోవడం గమనార్హం.
ఈ సందర్బంగా ఉక్కు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఉక్కు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ధోరణికి వ్యతిరేకంగా.. జీతాల విషయమై ఈనెల 18న కుటుంబాలతో సహా ఆందోళన చేసేందుకు సమాయత్తం అవుతున్నట్టు కార్మికులు తెలిపారు. ఇక, కార్మికుల ప్రకటనపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ తమకు మద్దతుగా నిలవాలని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment