సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరినట్టు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో విశాఖ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి కుమారస్వామిని ఈరోజు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరాం. తెలుగు ప్రజల త్యాగాల ఫలితం విశాఖ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్‌కు ఉన్న అప్పులను ఈక్విటీలుగా మార్చాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరాము.
మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దశలవారీగా విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ తన తొలి ప్రాధాన్యతగా మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ అంశంపై కేంద్ర కేబినెట్‌కు ఫైల్ వెళ్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగుతుందని హామీ ఇచ్చారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment