సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యోగులు.. కూటమి నేతలపై ఆశలు వదులుకున్నారు. కూటమి సర్కార్ కారణంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఉక్కు కార్మికులు వీఆర్‌ఎస్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వైదొలగడమే మంచిదనే భావనలో ఉక్కు ఉద్యోగులు ఉన్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం విశాఖ ఉక్కు కార్మికులకు శాపంగా మారింది. స్టీట్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూటమి నేతలు అడ్డుకోకపోవడంతో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్న వేళ కార్మికుల్లో గందరగోళం నెలకొంది. ముడి సరుకు రాకపోవడం, ఉత్పత్తి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సమయానికి జీతాలు కూడా ఇవ్వకపోతుండటంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కూటమి సర్కార్‌పై ఉక్కు కార్మికులు ఆశలు వదులుకున్నారు. చేసేదేమీ లేకపోవడంతో ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ కార్మికులు వీఆర్‌ఎస్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ నుంచి వైదొలగడమే మంచిదనే భావనకు వచ్చారు. మరోవైపు.. కూటమి సర్కార్ తీరు కార్మిక సంఘాలు మాట్లాడుతూ కార్మిక శక్తి తగ్గిపోతే ప్లాంట్ నిర్వీర్యం అవుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment