చంద్రబాబు, పవన్ ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనం
ఆమరణ నిరాహార దీక్షకు పోరాట కమిటీ నిర్ణయం
ఏపీ హక్కులను గాలికొదిలేశారు
నోరువిప్పని సీఎం, డిప్యూటీ సీఎం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ సభలో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రసంగాలపై ఉక్కు పోరాట కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయిస్తూ.. పోరాటానికి సన్నద్ధమవుతోంది. 35 గంటలకే దీక్ష విరమించి పెద్ద ఎత్తున నిరసన చేయాలని పోరాట కమిటీ నిర్ణయించింది.
ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు పోరాట కమిటీ నిర్ణయించింది. పోరాట కమిటీ ఛైర్మన్ ఆదినారాయణ తో సహా మరి కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. దీక్షా శిబిరం వద్దే ఉక్కు కార్మికులు ఉక్కు కార్మికులు బైఠాయించారు. కాగా, ఇప్పటికే దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసన చేస్తే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.
ఏపీ హక్కులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు. రాష్ట్ర హక్కుల కోసం ప్రధాని మోదీ ముందు వారు కనీసం నోరు విప్పలేదు. స్టీల్ ప్లాంట్ సహా ఏ సమస్యపై కూడా చంద్రబాబు, పవన్ అడగలేదు. కేవలం ప్రధాని మోదీ భజనకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది.
ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. మోదీ సభలో పచ్చి అబద్ధాలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అడగని చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ కోసం అడగని చంద్రబాబు.. పోలవరం నిర్వాసితుల నిధులపై కూడా స్పష్టత కోరలేదు.
చంద్రబాబు, పవన్‌లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిదంటూ నిత్యం ప్రగల్భాలు పలికే చంద్రబాబు, పవన్.. ఎంపీల బలం ఉన్నా ఏపీ హక్కుల కోసం నోరువిప్పలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సాగిలపాటు వైఖరి విశాఖ, ఏపీ ప్రజలను పూర్తిగా నిరాశపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment