బందువుల వివాహానికి వేళ్లి వస్తుండగా పట్టణంలోని 65 నంబర్‌జాతీయ రహాదారి కబ్‌రాస్తాన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7
సదాశివపేట: బందువుల వివాహానికి వెళ్లి వస్తుండగా పట్టణంలోని 65 నంబర్‌జాతీయ రహాదారి కబ్‌రాస్తాన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణ్(25) అక్కడికక్కడే దుర్మరణం చేందాడని ఎస్‌ఐ. పరమేశ్వర్‌గౌడ్ తెలిపారు. మృతుడు ఆరుణ్ హైదరాబాద్‌లోని మాణికేశ్వర్‌నగర్ కాలనీకి చేందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు ఆరుణ్, తల్లిలక్ష్మి, మేనమామలు వెంకటేశ్, వాసు, ఆత్త శ్రీదేవి మరో బందువుతో కలిసి టేవేరా వాహనంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా రాయికోడ్ మండలం హస్నాబాద్ గ్రామంలో జరిగిన బందువుల వివాహానికి హజరైయ్యారు.
సాయంత్రం తిరిగి హైదరాబాద్‌లోని మాణిక్వేశ్వర్‌నగర్ కాలనీలో వేలుతుండగా రాత్రి 7 గంటలకు సదాశివపేట పట్టణం కబ్‌రాస్తాన్ వద్దకు రాగానే తాము ప్రయాణిస్తున్న తవేరా వాహనం చేడిపోయింది. వాహనాన్ని డ్రై వర్ మరమ్మత్తు చేయిస్తుండగా సమీపంలోనే పానీపూరి కనిపించడంతో కారుమరమ్మతు పనులు పూర్తయ్యేవరకు పానీపూరీ తిందామని ఆరుగురు వెలుతున్నారు. జహిరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వేలుతున్న లారీ మృత్యూరుపాంలో ఆరుణ్‌ను ఢీకోట్టడంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఆరుణ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందు కొడుకు దుర్మణం చేందడంతో తల్లి లక్ష్మి రోదనలు అందరిని కలిచివేసింది.