పెళ్లికి హాజరై వెళ్తూ.. అనంతలోకాలకు | Woman Dies In Road Accident After Returning From Relatives Marriage In Hyderabad, More Details | Sakshi
Sakshi News home page

పెళ్లికి హాజరై వెళ్తూ.. అనంతలోకాలకు

Published Thu, Nov 14 2024 8:28 AM | Last Updated on Thu, Nov 14 2024 10:59 AM

woman dies in road accident

కారు ప్రమాదంలో భార్య మృతి, భర్త, కూతురికి గాయాలు

హైదరాబాద్‌లో ఘటన 

వేములవాడరూరల్‌: కూతురితో కలిసి బంధువుల పెళ్లికి హాజరయ్యారు.. అందరితో సంతోషంగా గడిపి, తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వేములవాడరూరల్‌ మండలంలోని లింగంపల్లికి చెందిన కొలిపాక సుమన్‌ హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. భార్య రోషిణి(24), కూతురితో కలిసి అక్కడే ఉంటున్నాడు.

 ముగ్గురూ వేములవాడలో జరిగిన బంధువుల వివాహానికి కారులో వచ్చారు. బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్‌ వెళ్లారు. రింగ్‌ రోడ్డుపై కారు అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోషిణి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భర్త సుమన్, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో పంచనామా అనంతరం రోషిణి మృతదేహాన్ని బంధువులు స్వగ్రామం లింగంపల్లికి తీసుకొచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement