‘‘డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారంటే నాకు పిచ్చి. ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ‘పడిపోయా నీ మాయలో’ సినిమా డిజైన్ చేసుకున్నా. ఆయనలా సినిమా తీయాలనేది నా కల’’ అని దర్శకుడు ఆర్.కె. కాంపల్లి అన్నారు. అరుణ్ గుప్తా, సావేరి, జయవర్ధన్ ముఖ్యపాత్రల్లో మహేశ్ పైడ, భరత్ అంకతి నిర్మించిన ‘పడిపోయా నీ మాయలో’ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ హైదరాబాద్‌లో జరిగింది. కాంపల్లి మాట్లాడుతూ– ‘‘భరత్‌గారు నాకు పదేళ్లుగా పరిచయం.
నేను చెప్పిన లైన్ నచ్చి, ఆయన సినిమా చేద్దామన్నారు. తర్వాత మహేశ్‌గారు మాతో జత కలిశారు. ముందుగా ఈ సినిమాకు వేరే టైటిల్ అనుకున్నాం. కానీ, కథానుగుణంగా ‘పడిపోయా నీ మాయలో’ యాప్ట్ అవుతుందని పెట్టాం. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇదే బ్యానర్‌లో నా రెండో సినిమా కూడా చేస్తా. ’’ అన్నారు. ‘‘ఆర్.కె.గారి ప్రతిభ గుర్తించాం. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. అరుణ్, సావేరి చక్కగా నటించారు’’ అన్నారు మహేశ్ పైడ, భరత్ అంకతి.
Comments
Please login to add a commentAdd a comment