
యువకుడి అవయవదానం
వేలూరు: ద్విచక్ర వాహన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకి అంబులెన్స్‌లో తరలించారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మోర్థాంగల్ గ్రామానికి చెందిన అరుణ్(23) ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 13న ద్విచక్ర వాహన ప్రమాదంలో అరుణ్ తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించా రు.
చికిత్స చేసినా ఫలించక అరుణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందు కు వచ్చారు. చెన్నైలోని మద్రాసు మెడిక ల్ మిషన్ ఆస్పత్రిలోని ఒక రోగికి గుండె ఆపరేషన్ చేసేందుకు అత్యవసరం కావడంతో వేలూరు సీఎంసీలోని వైద్యులు అధునాతన పద్ధతిలో అరుణ్ గుండెను శస్త్ర చికిత్స ద్వారా వేరుచేసి సోమవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో అంబులెన్స్‌లో చెన్నైకి తరలించారు. అరుణ్ కళ్లు, గుండె, వంటి అవయవాలను వివిధ రోగులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.