Chennai hospital
-
మృతురాలికి ‘ఠాగూర్’ తరహాలో చికిత్స
సాక్షి, చెన్నై: నగర శివారులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. మరణించిన మహిళకు ఠాకూర్ చిత్రం తరహాలో చికిత్స అందించి, చికిత్సకు తగ్గ ఫీజుల్ని కట్టించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఓ కాంగ్రెస్ ప్రముఖుడు రంగంలోకి దిగి పంచాయితీ పెట్టే పరిస్థితి నెలకొంది. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం, శ్రీకాకుళం పరిసరాలకు చెందిన వలస కూలీలు అనేక మంది పళ్లికరణై – పెరుంబాక్కం మార్గంలో ఉన్నారు. వీరంతా భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిర్మాణాలు జరిగే ప్రాంతాలే వీరికి ఆశ్రయంగా మారింది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ కష్టాల్ని ఎదుర్కొంటున్న ఈ కూలీల్లో ఓ కుటుంబం రెండు రోజుల నుంచి తీవ్ర మనో వేదనలో మునిగింది. ఈ ప్రాంతానికి చెందిన వెంకటరావు భార్య సుజాత హఠాత్తుగా స్పృహ తప్పింది. అపస్మారక స్థితిలోకి ఆమె వెళ్లడంతో ఆందోళన చెందిన వలస కూలీలు చేసేది లేక సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లాక్డౌన్ వేళ వైద్య సేవలు కష్టమేనని పేర్కొన్న ఆస్పత్రి వర్గాలు చివరకు రూ. 40 వేలు చెల్లిస్తే అడ్మిట్ చేసుకుంటామని సలహా ఇచ్చినట్టు సమాచారం. లక్షా 24 వేలు బిల్లు.. కడుపు మాడ్చుకుని రేయింబవళ్లు కూలి నాలి చేసుకుని సంపాదించిన మొత్తంలో తమ వద్ద ఉన్న రూ. 35 వేలు చెల్లించి సుజాతను ఆస్పత్రిలో చేర్చారు. ఠాకూర్ సినిమా తరహాలో చికిత్స సుజాతకు సాగినట్టు సమాచారం. రూ.60 వేలుకు మందులు, మాత్రులు, స్కానింగ్‌లు, ఇతర వెద్యపరికరాల బిల్లు వెంకట్రావు చేతికి చేరింది. అయితే, తన వద్ద అంత మొత్తం లేదని ఆస్పత్రి వర్గాల వద్ద వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశాడు. ఉదయాన్నే గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని, అంత వరకు చికిత్స అందించాలని వేడుకున్నాడు. అంగీకరించిన ఆస్పత్రి వర్గాలు మరుసటి రోజు సుజాత మరణించినట్టు, రూ.లక్షా 24 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వెంకట్రావుకు సలహా ఇచ్చాయి. అయితే తన భార్యకు రాత్రంతా ఏం చికిత్స చేశారంటూ వెంకట్రావు నిలదీశాడు. ఠాకూర్ సినిమా ఘటనను గుర్తు చేసుకుని ఆస్పత్రి వర్గాలపై వలస కూలీలు విరుచుకు పడ్డాయి. ఇక, చేసేది లేఖ ఆంధ్రాలో ఉన్న బంధువుల ద్వారా ఓ కాంగ్రెస్ నాయకుడిని వెంకట్రావు సంప్రదించినట్టున్నారు. ఆయన ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుడికి చెప్పడంతో శనివారం వ్యవహారం మీడియా దృష్టి చేరింది. దీంతో మీడియాలో రచ్చ మొదలు కావడం, కాంగ్రెస్ నాయకుడు పంచాయితీ వెరసి రూ.50 వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు సలహా ఇవ్వడం గమనార్హం. చివరకు 30 వేలు ఇచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈ వలస కూలీలకు ఏర్పడింది. అయితే, మీడియాలో వ్యవహారం రచ్చకెక్కడంతో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆమెను 11.30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని, 12.30 గంటలకు తొలిసారిగా గుండె పోటు వచ్చినట్టు, మళ్లీ..మళ్లీ గుండె పోటు రావడంతో 3.30 గంటలకు మరణించినట్టు వివరించారు. ఆస్పత్రి బిల్లు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు తమపై నిందలు వేస్తున్నారని ఆ బులిటెన్‌లో ఆస్పత్రి వర్గాలు వివరించి చేతులు దులుపుకున్నాయి. -
‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ గురువారం మరణించారు. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతోపాటు, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన రాజగోపాల్ కథ ముగిసింది. హత్య కేసులో దోషిగా తేలి , జీవిత ఖైదు శిక్ష విధించిన నేపథ్యంలో జూలై 8వ తేదీన ఆ యన కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, గుండెపోటుతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. చదవండి : పర స్త్రీ వ్యామోహంతో ‘దోశ కింగ్’ పతనం ‘శరవణ’ యజమానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు -
తమిళనాడులో ఇద్దరు ఏపీ మెడికోలు మృతి
-
తమిళనాడులో ఇద్దరు ఏపీ విద్యార్థుల మృతి
తిరుత్తణి(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల(ఎస్వీయూ)లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కారులో చెన్నైకి వెళుతున్నారు. ఈ క్రమంలో తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్దకు రాగానే కారు అదుపు తప్పి ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుదర్శన్, శివసాయికృష్ణ అనే వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను తిరుత్తణి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రిలోనే అమ్మ
ఆరోగ్యం కుదుట పడ్డా, అమ్మ జయలలిత ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆదివారం వైద్యుల బృందం అమ్మకు పరీక్షలు జరిపారు. ఇక, ప్రభుత్వ వ్యవహారాల్ని ఆస్పత్రి నుంచి అమ్మ పరిశీలించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా పోయెస్ గార్డెన్‌కు చేరాలని అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో లీనమయ్యారు. సాక్షి, చెన్నై: తీవ్ర జ్వరం, డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైన సీఎం జయలలిత శుక్రవారం వేకువజామున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఆమెకు నలుగురు వైద్యులతో కూడిన బృందం వైద్య పరీక్షల్ని అందిస్తున్నారు. నాలుగో రోజుగా ఆదివారం కూడా ఆమెకు వైద్య పరీక్షలు జరిగాయి. కాగా అమ్మను పరామర్శించి వచ్చిన వాళ్లంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన వద్దని స్పందిస్తుండడం గమనార్హం. ఇక, ఆస్పత్రి పరిసరాల్లోకి అన్నాడీఎంకే వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. అటు వైపుగా వచ్చే వాహనాలను గ్రీమ్స్ రోడ్డులో నిలుపుదల చేస్తున్నారు. ప్రముఖులు, అంబులెన్స్‌లను మాత్రం ఆస్పత్రి వైపు అనుమతించగా, మిగిలిన వాహనాల్లో వచ్చిన ఇతర రోగుల బంధువులు, ఇతరుల్ని అక్కడ ఏర్పాటు చేసిన బ్యాటరీ కారులో ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అయినా, అన్నాడీఎంకే వర్గాలు పలువురు ఆసుపత్రి వద్దకు చేరుకుని , వెలుపల మోకాలి మీద నిలబడి ప్రత్యేక ప్రార్థన చేశారు. అమ్మ ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి త్వరితగతిన ఇంటికి చేరుకోవాలని కాంక్షించారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పూజలు సాగాయి. ఆలయాల్లో అమ్మ పేరిట అర్చనలు, రథం లాగడం, హోమాది పూజల్లో ఆ పార్టీ వర్గాలు నిమగ్నమయ్యాయి. కొవ్వొత్తులు వెలిగించి చర్చిల్లో ప్రార్థనలు జరిగాయి. అనేక ఆలయాల్లో 1,008 కొబ్బరి టెంకాయల్ని కొట్టి అమ్మ కోసం వేడుకున్నారు. కొన్ని చోట్ల మేరి మాత ఆలయాల్లో అమ్మ కోసం అన్నాడీఎంకే వర్గాలు ప్రార్థన చేశారు. ఆస్పత్రిలో ఉన్న అమ్మను ఆర్థికమంత్రి ఓ పన్నీరు సెల్వం, రెవెన్యూ మంత్రి ఆర్బీ. ఉదయకుమార్, ఆరోగ్యమంత్రి విజయ భాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, సలహదారు షీలాబాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధా కృష్ణన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవహారాలకు తగ్గ సూచనలు, సలహాలను అమ్మ అధికారులు, సీనియర్ మంత్రి పన్నీరు సెల్వంకు ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే మహిళా నాయకురాలు, సినీ నటి సీఆర్ సరస్వతి మీడియాతో స్పందిస్తూ, అమ్మ సంపూర్ణ ఆర్యోగవంతు రాలు అయ్యారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారని, త్వరలో ఆమె ఇంటికి చేరుతారని వ్యాఖ్యానించారు. అమ్మ రాత్రికి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వచ్చినా, ఏ ఒక్కరూ ధ్రువీకరించ లేదు. వదంతులు నమ్మొద్దు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై సాగుతున్న వదంతుల్ని నమ్మోద్దు అని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్, కార్యదర్శి రాధాకృష్ణన్, అపోలో వైద్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ బామా, చీఫ్ సుబ్బయ్య విశ్వనాథన్, డాక్టర్ వెంకట్, డాక్టర్ రమేష్ మీడియా ముందుకు వచ్చారు. అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ఇది వరకు విడుదల చేసిన బులిటెన్లలో పేర్కొన్న మేరకు తాము అందించిన వైద్య సేవలకు సీఎం ఆరోగ్యం మెరుగు పడిందని ప్రకటించారు. తమ వైద్య పరీక్షలు, పరిశోధనలకు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఆమెకు మరి కొద్ది రోజుల విశ్రాంతి తప్పని సరి అని పేర్కొన్నారు. విశ్రాంతి మేరకు తాము ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే, సోషల్ మీడియాల్లో సాగుతున్న వదంతుల్ని నమ్మ వద్దని స్పష్టంచేశారు. విదేశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయాల్సినంత అవసరం లేదని, విదేశాలకు తరలించడం లేదని స్పష్టం చేశారు. అవన్నీ తప్పుడు సమాచారాలు, వదంతులు అని, సీఎంకు విదేశీ చికిత్స, వైద్య అనవసరం అని స్పష్టం చేశారు. కొన్ని రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు ఆనందం వ్యక్తంచేశారు. -
యువకుడి అవయవదానం
వేలూరు: ద్విచక్ర వాహన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకి అంబులెన్స్‌లో తరలించారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మోర్థాంగల్ గ్రామానికి చెందిన అరుణ్(23) ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 13న ద్విచక్ర వాహన ప్రమాదంలో అరుణ్ తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించా రు. చికిత్స చేసినా ఫలించక అరుణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందు కు వచ్చారు. చెన్నైలోని మద్రాసు మెడిక ల్ మిషన్ ఆస్పత్రిలోని ఒక రోగికి గుండె ఆపరేషన్ చేసేందుకు అత్యవసరం కావడంతో వేలూరు సీఎంసీలోని వైద్యులు అధునాతన పద్ధతిలో అరుణ్ గుండెను శస్త్ర చికిత్స ద్వారా వేరుచేసి సోమవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో అంబులెన్స్‌లో చెన్నైకి తరలించారు. అరుణ్ కళ్లు, గుండె, వంటి అవయవాలను వివిధ రోగులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గ్లామర్ క్వీన్
-
ప్రముఖ నటి మంజుల కన్నుమూత