
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ గురువారం మరణించారు.
మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతోపాటు, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన రాజగోపాల్ కథ ముగిసింది. హత్య కేసులో దోషిగా తేలి , జీవిత ఖైదు శిక్ష విధించిన నేపథ్యంలో జూలై 8వ తేదీన ఆ యన కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, గుండెపోటుతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.