రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు.
తిరుత్తణి(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల(ఎస్వీయూ)లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కారులో చెన్నైకి వెళుతున్నారు. ఈ క్రమంలో తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్దకు రాగానే కారు అదుపు తప్పి ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో సుదర్శన్, శివసాయికృష్ణ అనే వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను తిరుత్తణి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.