ప్రముఖ నటి మంజుల (60) మంగళవారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడలో సుమారు వంద చిత్రాల్లో పైగా నటించిన మంజుల... ప్రముఖ నటుడు విజయ్ కుమార్ సతీమణి. 1969లో 'శాంతి నిలయం' ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన మంజుల అనతి కాలంలోనే అగ్ర నటుల సరసన నటించింది. తెలుగులో మంజుల చివరి చిత్రం వెంకటేష్ హీరోగా నటించిన 'వాసు'. వీరి ముగ్గురు అమ్మాయిలు వనిత, ప్రీతి, శ్రీదేవి తెలుగు సినిమాలలో నటించారు. కాగా మంజుల మృతి పట్ల తెలుగు, తమిళ చిత్రసీమకు చెందినవారు సంతాపం తెలిపారు.