కొడుకును బేరం పెట్టిన తండ్రి
Published Sat, Nov 12 2016 2:19 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM
కామారెడ్డి: కన్న బిడ్డను అమ్మకానికి పెట్టిన భర్తకు, భార్య దేహశుద్ది చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా భాన్సువాడ మండలం దేశాయిపేటలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తన ఏడాదిన్నర కొడుకు అరుణ్‌ను రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనిని ప్రశ్నించగా బంగారు తల్లి పథకం వర్తించాలని అమ్ముతున్నట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న అతని భార్య పోలీసులకు సమాచారం అందించి.. కన్న పేగును అమ్మేందుకు యత్నించిన అతనికి దేహశుద్ధి చేసింది.
Advertisement
Advertisement