ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా? | Sustains the increase in of regional disparities? | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా?

Published Thu, Jul 31 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా?

ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా?

రాజధాని ఎంపిక కు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ గీటు రాళ్లు కావాలి. వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగుతాయి.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం చూస్తే పాలకులు రాష్ట్ర ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారనిపిస్తోంది. సీఎం ఆ లోచనలు, మాటలు గుంటూరు - విజ యవాడ - తెనాలి చుట్టే పరిభ్రమిస్తుం డటం చూస్తూనే ఉన్నాం. అన్ని ముఖ్య కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, విద్యా, వైద్య సంస్థలను విశాఖ నుండి గుం టూరు పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రాజధానిపై ముందే నిర్ణయం జరిగిందనే భావన బలపడుతోంది. దుర దృష్టవశాత్తూ మన మహా నగరాల అభివృద్ధి అనుభవాల గుణ పాఠాల దృష్టి నుండి, ప్రాంతీయ అసమానతల వల్ల తలెత్తుతున్న సామాజిక ఉద్రిక్తతల నేపథ్యం నుండి మన రాజధాని ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అనే అంశం చర్చకు రావడం లేదు. ముఖ్యమంత్రి సహా చాలా మంది రాజధానిని ఒక ‘స్వప్నసీమ’గా, సింగపూర్ దిగొచ్చినట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇది చూస్తే హైదరాబాద్‌లో ప్రభు త్వ కార్యాలయాలు, అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల కలిగిన దుష్ఫలితాలను విస్మరించారనిపిస్తుంది. ఇక అత్యం త అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలున్న ఈరోజుల్లో  రాజధాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండాలనే వాదన అర్థరహితం. అమెరికా రాజధాని ‘వాషింగ్‌టన్ డీసీ’ ఒక మూలకు ఉంది! తెలంగాణ, కర్నాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై) రాజధానులు కూడా అలాగే ఉన్నాయి.

ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని ఏర్పా టు వల్ల మౌలిక సదుపాయాల కల్పన సులభమనే వాదన సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ రాజధాని ఎంపిక కమిటీ విధివిధానాలలోని 3వ క్లాజు... విలువైన వ్యవసాయ భూములను రాజధాని నిర్మాణానికి వాడరాదని విధించిన నిబంధన అత్యంత విజ్ఞతాయుతమైనది. మన మహా నగ రాల అభివృద్ధి అంతా పంట భూములను మింగేస్తూ జరిగినదే. దీంతో రైతులు, రైతు కూలీలు, వృత్తి పనివారి జీవితాలు ధ్వంసమయ్యాయి. మహానగరాల అభివృద్ధిలోని చీకటి నీడలను విస్మరించి అన్నీ అమరి ఉన్న నగరాల్లోనే రాజధానిని నిర్మించడం విధ్వంసకర వృద్ధికి ఆహ్వానం పలకడమే. పాలకుల దృష్టిలో ఉన్నవి నీటి పారుదల గల వ్యవసాయ భూములు. ప్రభుత్వ భూములు తక్కువ. అక్కడ భూసేకరణ అత్యంత ఖర్చుతో కూడిన పనే కాదు, అనర్ధదాయకం. అటవీ భూముల్లో రాజ ధానిని నిర్మించడం మరింత ప్రమాదకరం. రాష్ట్రంలో అడ వులు అభిలషణీయ స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నా యని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అకాల ప్రకృతి వైపరీత్యాలకు ఆలవాలమైన రాష్ట్రాన్ని మరింత ప్రమాదం లోకి నెట్టే యోచన  అర్ధరహితం. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నేడు దేశవ్యాప్తంగానే అత్యంత ప్రాధాన్యం గల అంశం. కాబట్టి రాజధాని ఎంపికకు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేవే ప్రధానమైన గీటు రాళ్లు కావాలి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలూ ఏర్పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడు తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధా న్యం ఇవ్వడం ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగు తాయి. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ప్రజల్లో అసంతృప్తి పెరగడం, పోరాటాలకు దిగడం అనివార్యం. తెలంగాణ విడిపోయిన తర్వాతనైనా సీమ అవసరాలను గుర్తించక కేంద్ర, రాష్ట్ర సంస్థలను, ఆర్టీసీ, వ్యవసాయ విద్యాలయం, రైల్వే జోన్ తదితరాలన్నిటినీ కోస్తా పట్టణాలకు కేటాయి స్తున్నారు. దీంతో సీమ వాసుల్లో మరలా మోసపోతున్నా మనే భావన ఏర్పడింది. అలాగే ఉత్తరాంధ్ర (విశాఖపట్టణం మినహా) ప్రజల్లో కూడా కొత్త రాష్ట్రం తమను విస్మరించిం దనే భావన నెలకొంది. మేం ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనా? అనే ప్రశ్న సీమ (ప్రకాశం, నెల్లూరు సహా), ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉదయిస్తోంది. అధికార కేంద్రీకరణలాగే అభివృద్ధి కేంద్రీకరణ కూడా అప్రజాస్వామికం.

1937లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఐక్యతకు ప్రాతిపదికగా రూపొందిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక. ఆ చారిత్రక ఒప్పందాన్ని నేడైనా అమలు చేసి కర్నూలును రాజధాని చేయడం సబబు. కాదనుకుంటే సీమలోకెల్లా వెనుకబడిన అనంతపురం లేదా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం లేదా విజయనగరాల్లో ఒక దాన్ని లేదా పల్నాడును ఎంపిక చేయాలని రాయలసీమ విద్యా వంతుల వేదిక భావిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ఒక చోట రాజధానిని ఏర్పరిస్తే, రెండో చోట ఏడాదికి కనీసం ఒకమారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, మూడవ చోట హైకోర్టును నెలకొల్పడం న్యాయం. అప్పుడే అన్ని ప్రాంతాల మధ్య సమ న్యాయాన్ని పాటించినట్టవుతుంది.
 
(వ్యాసకర్త రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్)  అరుణ్

 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement