Choice of capital
-
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే రాజధాని
రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ హైదరాబాద్: శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక చేయాలని రాయలసీమ జేఏసీ కో కన్వీనర్ భూమన్ డిమాండ్ చేశారు. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దీక్ష జరిగింది. దీనికి రాయలసీమ జేఏసీ కన్వీనర్ బొజ్జా దశరథ రాంరెడ్డి, మాజీ పోలీసు అధికారి హనుమంతరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమరాలు శ్యామలా రెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. విభజన బిల్లులో తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌కు గతంలో మాదిరిగా కర్నూలును రాజధానిగా ప్రకటిస్తే ఈ వివాదం ఉండేది కాదని వక్తలు పేర్కొన్నారు. -
ప్రాంతీయ అసమానతలను పెంచి పోషిస్తారా?
రాజధాని ఎంపిక కు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ గీటు రాళ్లు కావాలి. వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం చూస్తే పాలకులు రాష్ట్ర ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారనిపిస్తోంది. సీఎం ఆ లోచనలు, మాటలు గుంటూరు - విజ యవాడ - తెనాలి చుట్టే పరిభ్రమిస్తుం డటం చూస్తూనే ఉన్నాం. అన్ని ముఖ్య కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, విద్యా, వైద్య సంస్థలను విశాఖ నుండి గుం టూరు పరిధిలోనే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి రాజధానిపై ముందే నిర్ణయం జరిగిందనే భావన బలపడుతోంది. దుర దృష్టవశాత్తూ మన మహా నగరాల అభివృద్ధి అనుభవాల గుణ పాఠాల దృష్టి నుండి, ప్రాంతీయ అసమానతల వల్ల తలెత్తుతున్న సామాజిక ఉద్రిక్తతల నేపథ్యం నుండి మన రాజధాని ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అనే అంశం చర్చకు రావడం లేదు. ముఖ్యమంత్రి సహా చాలా మంది రాజధానిని ఒక ‘స్వప్నసీమ’గా, సింగపూర్ దిగొచ్చినట్టుగా ఉండాలని భావిస్తున్నారు. ఇది చూస్తే హైదరాబాద్‌లో ప్రభు త్వ కార్యాలయాలు, అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల కలిగిన దుష్ఫలితాలను విస్మరించారనిపిస్తుంది. ఇక అత్యం త అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలున్న ఈరోజుల్లో రాజధాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండాలనే వాదన అర్థరహితం. అమెరికా రాజధాని ‘వాషింగ్టన్ డీసీ’ ఒక మూలకు ఉంది! తెలంగాణ, కర్నాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై) రాజధానులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలలో రాజధాని ఏర్పా టు వల్ల మౌలిక సదుపాయాల కల్పన సులభమనే వాదన సమంజసమైనదిగా కనబడుతుంది. కానీ రాజధాని ఎంపిక కమిటీ విధివిధానాలలోని 3వ క్లాజు... విలువైన వ్యవసాయ భూములను రాజధాని నిర్మాణానికి వాడరాదని విధించిన నిబంధన అత్యంత విజ్ఞతాయుతమైనది. మన మహా నగ రాల అభివృద్ధి అంతా పంట భూములను మింగేస్తూ జరిగినదే. దీంతో రైతులు, రైతు కూలీలు, వృత్తి పనివారి జీవితాలు ధ్వంసమయ్యాయి. మహానగరాల అభివృద్ధిలోని చీకటి నీడలను విస్మరించి అన్నీ అమరి ఉన్న నగరాల్లోనే రాజధానిని నిర్మించడం విధ్వంసకర వృద్ధికి ఆహ్వానం పలకడమే. పాలకుల దృష్టిలో ఉన్నవి నీటి పారుదల గల వ్యవసాయ భూములు. ప్రభుత్వ భూములు తక్కువ. అక్కడ భూసేకరణ అత్యంత ఖర్చుతో కూడిన పనే కాదు, అనర్ధదాయకం. అటవీ భూముల్లో రాజ ధానిని నిర్మించడం మరింత ప్రమాదకరం. రాష్ట్రంలో అడ వులు అభిలషణీయ స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నా యని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అకాల ప్రకృతి వైపరీత్యాలకు ఆలవాలమైన రాష్ట్రాన్ని మరింత ప్రమాదం లోకి నెట్టే యోచన అర్ధరహితం. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నేడు దేశవ్యాప్తంగానే అత్యంత ప్రాధాన్యం గల అంశం. కాబట్టి రాజధాని ఎంపికకు ప్రాంతీయ అసమానతల తొలగింపు, అభివృద్ధి వికేంద్రీకరణ అనేవే ప్రధానమైన గీటు రాళ్లు కావాలి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలూ ఏర్పాటు ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడు తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు, నగరాలకే ప్రాధా న్యం ఇవ్వడం ప్రాంతీయ అసమానతలు మరింత పెరుగు తాయి. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు ప్రజల్లో అసంతృప్తి పెరగడం, పోరాటాలకు దిగడం అనివార్యం. తెలంగాణ విడిపోయిన తర్వాతనైనా సీమ అవసరాలను గుర్తించక కేంద్ర, రాష్ట్ర సంస్థలను, ఆర్టీసీ, వ్యవసాయ విద్యాలయం, రైల్వే జోన్ తదితరాలన్నిటినీ కోస్తా పట్టణాలకు కేటాయి స్తున్నారు. దీంతో సీమ వాసుల్లో మరలా మోసపోతున్నా మనే భావన ఏర్పడింది. అలాగే ఉత్తరాంధ్ర (విశాఖపట్టణం మినహా) ప్రజల్లో కూడా కొత్త రాష్ట్రం తమను విస్మరించిం దనే భావన నెలకొంది. మేం ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనా? అనే ప్రశ్న సీమ (ప్రకాశం, నెల్లూరు సహా), ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉదయిస్తోంది. అధికార కేంద్రీకరణలాగే అభివృద్ధి కేంద్రీకరణ కూడా అప్రజాస్వామికం. 1937లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఐక్యతకు ప్రాతిపదికగా రూపొందిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాతిపదిక. ఆ చారిత్రక ఒప్పందాన్ని నేడైనా అమలు చేసి కర్నూలును రాజధాని చేయడం సబబు. కాదనుకుంటే సీమలోకెల్లా వెనుకబడిన అనంతపురం లేదా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం లేదా విజయనగరాల్లో ఒక దాన్ని లేదా పల్నాడును ఎంపిక చేయాలని రాయలసీమ విద్యా వంతుల వేదిక భావిస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ఒక చోట రాజధానిని ఏర్పరిస్తే, రెండో చోట ఏడాదికి కనీసం ఒకమారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, మూడవ చోట హైకోర్టును నెలకొల్పడం న్యాయం. అప్పుడే అన్ని ప్రాంతాల మధ్య సమ న్యాయాన్ని పాటించినట్టవుతుంది. (వ్యాసకర్త రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్) అరుణ్ -
సమ దృష్టే రాయలసీమకు రక్ష
రాజధాని ఎంపికలో నాడు ఏ సమస్యలైతే తీవ్ర చర్చనీయాంశాలైనాయో, ఇప్పుడూ అవే పునరావృతమైనాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడడానికి సీమ వాసులు ముందు వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ కుటిల రాజకీయాలకు బలైంది. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసి, కలహాల కుంపట్లు రగిలించారు. ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలలో కలసి మెలసి జీవిస్తూ హైదరాబాద్‌ను మంచి రాజధానిగా, మహానగరంగా తీర్చిదిద్దుకున్నాం. అంతిమంగా ఆ అభి వృద్ధి ఫలాలను అనుభవించే అర్హత లేదంటూ సీమాంధ్ర ప్రజల తలరాత లను మార్చేశారు. మిగిలిన 13 జిల్లా లతో ఆంధ్రప్రదేశ్ అన్న పేరుతోనే రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీక రించారు. రాజధానిని నిర్ణయించకుం డానే వదిలిపెట్టారు. అడ్డగోలు విభజనలో కాంగ్రెస్‌కు సహకరించిన బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాస నసభలో తెలుగుదేశం అధికార పక్షం కాగా, వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు, కమ్యూని స్టులకు ప్రాతినిధ్యమే లేదు. కొత్త రాజధాని ఎంపికలో చేదు అనుభవాలు పునరావృతం కాని రీతిలో రాయలసీమ, ఉత్త రాంధ్ర, మధ్య, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల అభీష్టానికి అను గుణంగా నిర్ణయం తీసుకోవాలి. మద్రాసు నగరాన్ని (నేడు చెన్నై) వదులుకోవడం నష్ట మే అయినా, నాడు ఆంధ్రరాష్ట్రం పోరాడి సాధించుకున్నారు కాబట్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అంతగా విచారిం చలేదు. మద్రాసును ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీలు కోరాయి. నాటి ప్రధాని నెహ్రూ దీనిని తోసిపుచ్చారు. తరువాత విజయవాడ రాజ ధానికి అనువైన దని కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదిం చింది. కృషీకార్ లోక్‌పార్టీ తిరుప తి మీద మొగ్గు చూపింది. దీని మీద ఉమ్మడి మద్రాసు శాసనసభలోని ఆంధ్ర శాసనసభ సభ్యులు జూన్ 5, 1953న ప్రత్యేక సమావేశం జరి పారు. ఐదురోజులు చర్చించి వెనుకబడిన రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని, కర్నూలును తాత్కాలిక రాజధానిని చేయాలని నిర్ణయించారు. హైకోర్టును గుంటూరులో నెలకొ ల్పాలని తీర్మానించారు. రాజధాని ఎంపికలో నాడు ఏ సమస్యలైతే తీవ్ర చర్చనీ యాంశాలైనాయో, ఇప్పుడూ అవే పునరావృతమైనాయి. ఆంధ్ర రాష్ట్రంలో సర్కారు జిల్లాలు పెత్తనం సాగిస్తాయనే బలమైన భావనతో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు పడడానికి రాయలసీమ వాసులు ముందు తటపటాయించ డమే కాదు వ్యతిరేకించారు. రాయలసీమ వాసుల మనోగ తాన్ని పసిగట్టి, 1936 నాటి ‘శ్రీబాగ్ ఒడంబడిక’(పెద్ద మనుషుల ఒప్పందం) ద్వారా సీమ ప్రజలకు భరోసా ఇచ్చి ఉద్యమంలో అంతర్భాగం చేశారు. కానీ శ్రీబాగ్ ఒడంబడిక బుట్టదాఖలా అయింది. రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర విభజన చట్టంలో ఎలాంటి నిర్దిష్టమైన ప్రణాళికను పొందుపరచ లేదు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పేర్కొన్న అంశాలన్నీ కోస్తాంధ్ర కేంద్ర బిందువుగానే ఉన్నాయి. విశా ఖ - నెల్లూరు మధ్య ఉన్న ప్రాంతంపైనే కేంద్రీకరించినట్టు కనిపిస్తున్నది. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్ పరిణా మాలను ఊహించుకొంటున్న రాయలసీమ ప్రజానీకానికి విశ్వాసం కలిగించే ప్రయత్నం జరగడం లేదనిపిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించి, అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి, ఖర్చు చేయడం ద్వారా మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించగలరు. సీమకు విస్తా రమైన భూసంపద, ఖనిజ, అటవీ సంపద ఉన్నాయి. కానీ, నీరే సమస్య. కృష్ణా నదీజలాల వినియోగ నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయమే కృష్ణా నదీ జలాల నిర్వహణ, వినియోగంలో గుండెకాయ లాంటిది. తుంగభద్ర, జూరాల జలాశయాల వద్ద నీటి నిల్వ, వినియోగాంశాలు కీలకమైనవి. అందువల్ల బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితం. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ఉన్నత విద్యా సంస్థల్లో కొన్నింటిని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. రాజధాని సమ స్యను మాత్రమే వేరుచేసి అత్యాధునిక హంగులతో గుం టూరు - విజయవాడ లేదా విజయవాడ - ఏలూరు మధ్య లేదా మరెక్కడైనా మహానగరాన్ని నిర్మిస్తామని చెబితే రాయ లసీమకు ఒరిగేదేమీలేదు. ‘సమగ్ర దృష్టి, సమగ్రాభివృద్ధి, సమన్యాయం’ ప్రాతిపదికన నవ్యాంధ్రప్రదేశ్‌లో సుపరిపాల నను ప్రజలు కోరుకొంటున్నారు. (వ్యాసకర్త నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం కార్యనిర్వాహకులు, హైదరాబాద్) టి. లక్ష్మీనారాయణ