శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే రాజధాని | capital city should be according to sribag pact | Sakshi
Sakshi News home page

శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే రాజధాని

Published Sun, Aug 3 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

capital city should be according to sribag pact

రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్

హైదరాబాద్: శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక చేయాలని రాయలసీమ జేఏసీ కో కన్వీనర్ భూమన్ డిమాండ్ చేశారు. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దీక్ష జరిగింది.

దీనికి రాయలసీమ జేఏసీ కన్వీనర్ బొజ్జా దశరథ రాంరెడ్డి, మాజీ పోలీసు అధికారి హనుమంతరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమరాలు శ్యామలా రెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. విభజన బిల్లులో తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌కు గతంలో మాదిరిగా కర్నూలును రాజధానిగా ప్రకటిస్తే ఈ వివాదం ఉండేది కాదని వక్తలు పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement