BCCI Arun Dhumal Comments On India Tour Of South Africa Schedule Due To Omircon - Sakshi
Sakshi News home page

India Tour Of South Africa: ‘దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పు లేదు’ 

Published Wed, Dec 1 2021 8:14 AM | Last Updated on Wed, Dec 1 2021 10:32 AM

Omicron: BCCI Arun Dhumal Comments Over India Tour Of South Africa - Sakshi

Omicron: BCCI Arun Dhumal Comments Over India Tour Of South Africa: వచ్చే వారం నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత క్రికెట్‌ జట్టు షెడ్యూల్‌లో ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పూ లేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ విస్తరిస్తుండటంతో ఈ టూర్‌పై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ధుమాల్‌ స్పష్టతనిచ్చారు.

అయితే ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడబోమని, ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏమైనా సూచనలు చేస్తే వాటిని అనుసరిస్తామని చెప్పారు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత డిసెంబరు 8 లేదంటే 9న భారత జట్టు దక్షిణాఫ్రికాకు పయనం కావాల్సి ఉంది. ఇక కివీస్‌తో తొలి టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికా వర్సెస్‌ ఇండియా 2021-22 షెడ్యూల్‌
మూడు టెస్టులు:
►తొలి టెస్టు- డిసెంబరు 17-21, జొహన్నస్‌బర్గ్‌.
►రెండో టెస్టు- డిసెంబరు 26-30, సెంచూరియన్‌
►మూడో టెస్టు- జనవరి 3-7, కేప్‌టౌన్‌

మూడు వన్డేలు:
►మొదటి వన్డే- జనవరి 11, పర్ల్‌
►రెండో వన్డే- జనవరి 14, కేప్‌టౌన్‌
►మూడో వన్డే- జనవరి 16, కేప్‌టౌన్‌

నాలుగు టీ20 మ్యాచ్‌లు
►మొదటి టీ20- జనవరి 19, కేప్‌టౌన్‌
►రెండో టీ20- జనవరి 21, కేప్‌టౌన్‌
►మూడో టీ20- జనవరి 23, కేప్‌టౌన్‌
►నాలుగో టీ20- జనవరి 26, పర్ల్‌.

చదవండి: IPL Retention: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్‌, రాహుల్‌, రషీద్‌, గిల్‌ ఇంకా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement