తొలిరోజు భారత్‌కు నిరాశ | Rajiv Tomar, Arun defeat in Wrestling World Championship | Sakshi
Sakshi News home page

తొలిరోజు భారత్‌కు నిరాశ

Published Tue, Sep 9 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

Rajiv Tomar, Arun defeat in Wrestling World Championship

రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్

తాష్కెంట్: ప్రపంచ చాంపియన్‌షిప్ అర్హత రౌండ్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. సోమవారం ప్రారంభమైన ఈ పోటీల్లో... కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన  రాజీవ్ తోమర్ 125కేజీల ఫ్రీస్టయిల్‌లో 1-3 తేడాతో కొరియాకు చెందిన ర్యోంగ్ సంగ్ చేతిలో ఓడాడు. అలాగే 70కేజీల ఫ్రీస్టయిల్‌లోనూ అరుణ్ 0-4 తేడాతో క్లియోపస్ క్యూబ్ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో మరో ఇద్దరు భారత రెజ్లర్లు రాహుల్ బాలాసాహెబ్ అవారే, నరేశ్ కుమార్ తమ ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఆసియా గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ తరఫున ద్వితీయ శ్రేణి రెజ్లర్లు బరిలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement