Wrestling World Championship
-
అంతిమ్ అదరహో... వరుసగా రెండో సారి ఛాంపియన్
అమ్మాన్ సిటీ (జోర్డాన్): భారత యువ మహిళా రెజ్లర్లు శుక్రవారం కొత్త చరిత్రను లిఖించారు. తొలిసారి ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. హరియాణా అమ్మాయి అంతిమ్ పంఘాల్ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. ఫైనల్లో అంతిమ్ 4–0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో అంతిమ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లే కోల్పోయింది. సవితా దలాల్ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్ అయ్యింది. ఫైనల్లో సవిత 10–0తో చిరినోస్ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం ప్రియా మాలిక్ (76 కేజీలు) స్వర్ణం నెగ్గిన సంగతి విదితమే. ఓవరాల్‌గా భారత్ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్ -
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లక్ష్యంగా రవి దహియా సన్నాహాలు
వచ్చే నెలలో జరిగే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం భారత స్టార్ రెజ్లర్ రవి దహియా (57 కేజీలు) రష్యాకు బయలుదేరి వెళ్లాడు. రష్యాలో 29 రోజులపాటు సాగే రవి శిక్షణ శిబిరం ఖర్చులన్నీ కేంద్ర క్రీడా శాఖ భరించనుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో రవి స్వర్ణం సాధించాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ ఢిల్లీ రెజ్లర్ విశ్వ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. -
వినేశ్ ఫొగాట్ డబుల్ ధమాకా..
నూర్-సుల్తాన్(కజకిస్తాన్): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ డబుల్ ధమాకా సాధించింది. బుధవారం ఓకే రోజు ముగ్గురిని మట్టి కరిపించి తన సత్తా చాటుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో పాటు ప్రపంచ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం అందుకుంది. రెండూ ఒకే రోజు అందుకోవడంతో వినేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో వినేశ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. అంతేకాకుండా ఈ మెగాటోర్నీలో పతకం సాధించిన నాలుగో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఘనత సాధించారు. ‘రెపిచేజ్’లో భాగంగా బుధవారం ఒకే రోజు యులియా (ఉక్రెయిన్), ప్రపంచ నంబర్‌వన్ సారా అన్ (అమెరికా), ప్రివొలరిక్ (గ్రీస్)లపై అలవోక విజయాలు సాధించింది. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టిన వినేశ్ ప్రిక్వార్టర్‌లోనే ప్రత్యర్థి దెబ్బకు తలొగ్గింది. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మయు ముకయిద (జపాన్) 7–0తో వినేశ్‌ను ఓడించింది. దీంతో టైటిల్ రేస్ నుంచి నిష్క్రమించింది. అయితే జపాన్ రెజ్లర్ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్ చేరింది. దీంతో వినేశ్‌కు ‘రెపిచేజ్’లో పాల్గొనే అవకాశం దక్కింది. రెపిచేజ్‌లో మూడు విజయాలు అందుకోవడంతో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌తో పాటు కాంస్య పతకం గెలుచుకుంది. -
తొలిరోజు భారత్‌కు నిరాశ
రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ తాష్కెంట్: ప్రపంచ చాంపియన్‌షిప్ అర్హత రౌండ్లో తొలి రోజు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. సోమవారం ప్రారంభమైన ఈ పోటీల్లో... కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన రాజీవ్ తోమర్ 125కేజీల ఫ్రీస్టయిల్లో 1-3 తేడాతో కొరియాకు చెందిన ర్యోంగ్ సంగ్ చేతిలో ఓడాడు. అలాగే 70కేజీల ఫ్రీస్టయిల్లోనూ అరుణ్ 0-4 తేడాతో క్లియోపస్ క్యూబ్ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో మరో ఇద్దరు భారత రెజ్లర్లు రాహుల్ బాలాసాహెబ్ అవారే, నరేశ్ కుమార్ తమ ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఆసియా గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ తరఫున ద్వితీయ శ్రేణి రెజ్లర్లు బరిలోకి దిగారు.