అమ్మాన్ సిటీ (జోర్డాన్): భారత యువ మహిళా రెజ్లర్లు శుక్రవారం కొత్త చరిత్రను లిఖించారు. తొలిసారి ప్రపంచ అండర్–20 చాంపియన్‌షిప్‌లో టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. హరియాణా అమ్మాయి అంతిమ్ పంఘాల్ వరుసగా రెండో ఏడాది 53 కేజీల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందింది.
ఫైనల్లో అంతిమ్ 4–0తో మరియా యెఫ్రెమోవా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో అంతిమ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లే కోల్పోయింది. సవితా దలాల్ (62 కేజీలు) కూడా ప్రపంచ చాంపియన్ అయ్యింది.
ఫైనల్లో సవిత 10–0తో చిరినోస్ (వెనిజులా)పై గెలిచింది. అంతిమ్ కుందు (65 కేజీలు) రజతం నెగ్గగా... రీనా (57 కేజీలు), ఆర్జూ (68 కేజీలు), హర్షిత (72 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం ప్రియా మాలిక్ (76 కేజీలు) స్వర్ణం నెగ్గిన సంగతి విదితమే. ఓవరాల్‌గా భారత్ ఏడు పతకాలు నెగ్గి 140 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment