
వచ్చే నెలలో జరిగే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సన్నాహాల కోసం భారత స్టార్ రెజ్లర్ రవి దహియా (57 కేజీలు) రష్యాకు బయలుదేరి వెళ్లాడు. రష్యాలో 29 రోజులపాటు సాగే రవి శిక్షణ శిబిరం ఖర్చులన్నీ కేంద్ర క్రీడా శాఖ భరించనుంది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో రవి స్వర్ణం సాధించాడు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ ఢిల్లీ రెజ్లర్ విశ్వ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు.
Comments
Please login to add a commentAdd a comment