తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం తెనుమళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడు రోజుల క్రితం ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన వద్ధుడ్ని అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు శనివారం ధర్నాకు దిగారు. పడాల సత్యనారాయణ (60) పాఠశాలలోని మధ్యాహ్న భోజనం చేసే ఓ మహిళ భర్త.. మూడు రోజుల క్రితం పాఠశాలలో బాలికపై సత్యనారాయణ అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరుతూ గ్రామస్తులు శనివారం పాఠశాల మందు ధర్నా చేపట్టారు. సత్యనారాయణ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని అతడ్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కామాంధుడ్ని అరెస్ట్ చేయాలంటూ ధర్నా
Published Sat, Sep 26 2015 12:26 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement