Leopards
-
సఫారీ విహారానికి కేరాఫ్ సుజన్ జవాయీ
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుజన్ జవాయీ.. రాజస్థాన్‌లోని జవాయీ అరణ్యంలో కేవలం పది విలాసవంతమైన గుడారాలు, ఒక రాయల్ టెంటెడ్ సూట్లో ఏర్పాటుచేసిన సఫారీ క్యాంప్. కానీ ఇక్కడ అందుబాటులో ఉండే సేవలు, అద్భుతమైన ప్రకృతి అందాల కారణంగా ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్‌లో ఇది ఒకటిగా స్థానం సంపాదించింది. జైసల్, అంజలీసింగ్ అనేవారు 2014లో పాలీ జిల్లాలో ఈ జంగిల్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. పెద్ద సంఖ్యలో చిరుతపులులు సంచరించే సుందరమైన గడ్డి మైదానాలు, పచ్చదనం పులుముకున్న పర్వత శ్రేణులు, జవాయీ నది మధ్యలో ఇసుక తిన్నెలు కవర్ చేసేలా ఈ క్యాంపును డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో 60 వరకు చిరుతలు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల ఊసే లేని ఈ ప్రాంతంలో స్థానికులు చిరుతలతో జీవిస్తుంటారు. ఇక్కడ టెంట్ బయట కూర్చొని అధ్బుతమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. అడవుల్లో చేసే సాహసాలు, చిరు™è ల ట్రాకింగ్, పొదల్లో బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట ఆరుబయట డిన్నర్ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ఆధునిక కాలంలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి సుజన్ జవాయీ క్యాంప్ ఒక మంచి అవకాశం. టూర్లో భాగంగా సమీపంలోని గ్రామాలకూ తీసుకువెళ్లి అక్కడి గ్రామీణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, పరిశీలించే అవకాశం కూడా కలి్పస్తారు. చిరుతలను వాటి సహజ ఆవాసాల్లో చూసేందుకు ఉదయం, సాయంత్రం సఫారీ ఉంటుంది. కొండపైన టెంట్ ముందు కూర్చొని జువాయీ సరస్సు అందాలు, చుట్టుపక్కల పొలాలను సాగుచేసుకునే రైతులను చూస్తూ సూర్యాస్తమయాలను ఆస్వాదించవచ్చు. పెరగనున్న విదేశీ పర్యాటకులు ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో సుజన్ జవాయీకి స్థానం లభించడంతో మరింత పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే టూరిస్ట్ డెస్టినీగా ఉన్న రాజస్థాన్‌కు ఇది మరింత ఊపు తీసుకువస్తుంది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా దేశ పర్యాటక రంగానికి ఆదాయం పెరుగుతుంది. ఎలా చేరుకోవచ్చు?⇒ ఈ క్యాంప్ ఉదయ్‌పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్లు, జోద్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 172 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ⇒ మోరీ బెరా రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అనుకూల సమయం⇒ అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య సందర్శనకు అత్యంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి ఉష్ణోగ్రతలు 10 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.⇒ విడిది చేయాల్సిన సమయం: ఇక్కడి అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం రెండు రాత్రులు, 3 పగళ్లు విడిది చేయాల్సి ఉంటుంది. 50 అత్యుత్తమ హోటల్స్‌లో స్థానంప్రపంచ వ్యాప్తంగా ఆరు ఖండాల్లో అత్యుత్తమ వసతులు కలిగిన 50 హోటల్స్‌లో సుజన్ జవాయీ హోటల్ స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్ జాబితాను ‘50 బెస్’ అనే సంస్థ ఇటీవల లండన్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో సుజన్ జవాయీ 43వ స్థానం సంపాదించింది. ట్రావెల్ జర్నలిస్ట్‌లు, ఆతిథ్యరంగ ప్రముఖులు, ట్రావెల్ స్పెషలిస్ట్‌లతో కూడిన 600 మంది గ్లోబల్ ఓటర్లు ఈ జాబితాను సెలెక్ట్ చేశారు. ఈ జాబితాలో థాయిలాండ్‌లోని చావో ఫ్రయా నదికి ఎదురుగా ఉన్న కాపెల్లా బ్యాంకాక్ అనే విలాసవంతమైన హోటల్ ప్రపంచంలో బెస్ట్ హోటల్‌గా నిలిచింది. ఇటలీలో లేక్ కోమోలోని 18 శతాబ్ధానికి చెందిన విల్లా పసలాక్వా రెండో స్థానంలో నిలిచింది. హాంకాంగ్‌కు చెందిన విలాసవంతమైన హోటల్ రోజ్‌వుడ్ హాంకాంగ్ మూడో స్థానంలో నిలిచింది. -
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిరుతల సంచారం
-
చిరుత నవ్వింది!
చిరుతలు దుమ్ము రేపుతున్నాయి. దేశమంతటా యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వాటి సంఖ్య బాగా పెరిగింది. కాకపోతే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో చిరుతలు తగ్గుతుండటం కాస్త కలవరపెట్టే అంశమేనని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. 2018లో భారత్‌లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ‘భారత్‌లో చిరుతల స్థితిగతులు–2022’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్టు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రం చిరుతల సంఖ్యలో గత నాలుగేళ్లలో తగ్గుదలే నమోదైంది. ఆవాస ప్రాంతాలతో పాటు ఆహార లభ్యత కూడా తగ్గిపోవడం, చిరుతల వేట విచ్చలవిడిగా పెరగడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ‘‘ఫలితంగా చిరుతలు నివాస ప్రాంతాలపైకి వచి్చపడుతున్నాయి. దాంతో జనం వాటిని హతమారుస్తున్నారు. ఈ ధోరణి కొంతకాలంగా పెరుగుతుండటం ఆందోళనకరం’’ అని నివేదిక ఆవేదన వెలిబుచి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చిరుతల సంఖ్య కాస్తో కూస్తో స్థిరంగానే కొనసాగినట్టు తెలిపింది. మొత్తమ్మీద వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని సర్వే వెలుగులోకి తెచి్చందని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల భారతీయుల సహన ధోరణి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్ చౌబే అభిప్రాయపడ్డారు. సంఖ్య పెరిగినా... ► గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1,022 చిరుతలు పెరిగాయి. ► మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెరుగుదల నమోదైంది. ► శాతాలపరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్ టాప్‌లో నిలిచింది. ► కానీ తెలంగాణతో పాటు గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో చిరుతల సంఖ్య తగ్గింది. ► ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు, అంటే 192 చిరుతలు తగ్గాయి. సర్వే ఇలా... ► దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే జరిపారు. ► ఇందుకు ఏకంగా 6.4 లక్షల పనిదినాలు పట్టింది! దీన్ని ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వణ్యప్రాణి సర్వేగా కేంద్రం అభివరి్ణంచింది. ► చిరుతలను గుర్తించేందుకు 32,803 వ్యూహాత్మక స్థానాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. ► అలా సమకూరిన 4 కోట్ల పై చిలుకు ఫొటోలను విశ్లేíÙంచారు. వాటిలో చిరుతలకు సంబంధించిన 85 వేల ఫొటోలను గుర్తించారు. ► తద్వారా చిరుతల మొత్తం సంఖ్యను 13,874గా నిర్ధారించారు ► అయితే సర్వేలో దేశంలోని చిరుతల ఆవాస ప్రాంతాల్లో 70 శాతాన్ని మాత్రమే కవర్ చేయగలిగినట్టు కేంద్రం పేర్కొంది. ► హిమాలయాలు, అటవేతర ఆవాసాలు, మెట్ట ప్రాంతాలను సర్వే పరిధి నుంచి మినహాయించారు. ► ఆ లెక్కన భారత్‌లో చిరుతల వాస్తవ సంఖ్య 13,874 కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది. విశేషాలు ఇవీ... మధ్య భారతంతో పాటు తూర్పు కనుమల్లో నాలుగేళ్లలో చిరుతలు 8,071 నుంచి 8,820కి పెరిగాయి. అంటే 1.5 శాతం పెరుగుదల నమోదైంది. పశి్చమ కనుమల్లో 3,387 నుంచి 3,596కు పెరిగాయి. ఈశాన్య కొండప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాల్లోనూ అవి 141 నుంచి 349కి పెరిగాయి. 2018లో శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో మాత్రం చిరుతలు 1,253 నుంచి 1,109కి, అంటే 3.4 శాతం తగ్గాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ అటవీ డివిజన్లో గత నాలుగేళ్లలో చిరుతలు తగ్గగా పులుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం! – సాక్షి, నేషనల్‌డెస్క్ -
అనుమానాస్పద స్థితిలో మూడు చిరుతల మృతి
సాక్షి, చైన్నె: తమిళనాడు, నీలగిరి జిల్లా కూడలూరు అటవీ ప్రాంతంలో మూడు చిరుతలు మృతిచెందాయి. అనుమానాస్పద స్థితిలో ఈ మరణాలు ఉండడంతో అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. నీలగిరి జిల్లా కూడలూరు పరిధిలో బంధిపుర పులుల అభయారణ్యం ఉంది. ఇక్కడి మంగళ గ్రామంలో ఏడాది వయస్సు ఉన్న ఓ చిరుత మరణించినట్టు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. చిరుతల మధ్య గొడవ జరిగిన తరహాలో ఆ పరిసరాలు ఉండడం, దాడిలో ఈ చిరుత మరణించి ఉంటుందని భావించారు. పోస్టుమార్టం సైతం నిర్వహించారు. అదేసమయంలో కూత వేటు దూరంలోని తేహం అనే ప్రాంతంలో మరో మగ చిరుత మృతదేహం బయటపడింది. ఈ రెండు చిరుతలు పరస్పరం దాడి చేసుకుని మరణించి ఉంటాయని భావించారు. అయితే, ఇక్కడికి సమీపంలోని కుందలుపేట వద్ద మరో చిరుత మరణించి ఉండడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇది విషంతో కూడిన మాంసం తినడంతో మరణించినట్ట విచారణలో తేలింది. ఈ చిరుతలు మరణించి మూడు రోజులై ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అటవీశాఖ అధికారి రమేష్ పర్యవేక్షణలో సిబ్బంది విచారిస్తున్నారు. -
నాసిక్: బావిలో పడిపోయిన రెండు చిరుతలు
-
అమ్మో పులి...! భయంతో వణికిపోతున్న ఆ ప్రాంత ప్రజలు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో మళ్లీ చిరుత పులుల అజలడి పెరిగింది. ఆహారం, నీటి కోసం వాటి ఆవాస ప్రాంతాల నుంచి మరో చోటికి సంచరిస్తున్నాయి. అడవులు, గుట్టలను వదిలి జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జిల్లాలోని పలు రేంజ్‌ల పరిధిలో చిరుతలు జనం కంట పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పశువులు, మేకలు మేపడానికి వెళ్లే కాపరులకు సైతం భయం పట్టుకుంది. రెండు రోజుల క్రితం నవీపేట్ మండలం అబ్బాపూర్ గుట్టల్లో చిరుత కదలికలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పాదముద్రలను చూసి చిరుతగా నిర్ధారించారు. ఇదే రేంజ్ పరిధిలోని మోకన్‌పల్లి శివారులో ఐదారు నెలల క్రితం కూడా చిరుతపులి కుక్కను వేటాడింది. అదే విధంగా కొన్ని రోజుల కిందట నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం అటవీ ప్రాంతంలో సైతం చిరుత కలకలం రేపింది. రోడ్డు దాటుతుండగా వాహనదారులు చూసి వణికిపోయారు. జిల్లాలో అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్, వర్ని, ఆర్మూర్, కమ్మర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ కలిపి మొత్తం ఏడు రేంజ్‌లు ఉన్నాయి. జిల్లా అటవీ విస్తీర్ణం 2,14,659 ఎకరాల్లో(20.86శాతం)ఉండగా, అత్యధికంగా ఒక్క మోపాల్ మండలంలోనే 29,101 ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉంది. దీని తర్వాత ఇందల్వాయి, కమ్మర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్‌ల పరిధిలో అడవులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లోనే చిరుత పులులు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 28 చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు శాఖ గుర్తించినప్పటికీ, వీటిసంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం పెరిగి మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తున్న క్రమంలో నిజామాబాద్ అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. కామారెడ్డి అడవుల నుంచి మన జిల్లాలోని వర్ని రేంజ్ పరిధిలోకి చిరుతలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టలు గుల్ల చేయడంతో.. జిల్లాలో సంచారం పెరడానికి గల కారణాలు ఆహారం, నీరే కాకుండా అవి ఏర్పర్చుకున్న ఆవాస ప్రాంతాల్లోని అడవులను ధ్వంసం చేయడం కూడా కారణం అవుతున్నాయి. మొరం తవ్వకాలు, వ్యవసాయం కోసం నేలను చదును చేసే పనులు చేపట్టి గుట్టలు, అడవులను కొల్లగొడుతున్నారు. తద్వారా శబ్దాలకు చిరుతలు, ఇతర వన్య ప్రాణులు సైతం జన సంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతలు మనుషులు, గొర్రెలు, మేకలపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడంతో కూడా గ్రామాల శివారు ప్రాంతాల్లో వచ్చి కుక్కలు, మేకలను వేటాడుతున్నాయి. గుట్టలు, అడవులకు నిప్పు పెట్టడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే, అటవీ అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా చిరుతలు అక్కడక్కడా కంటపడుతూనే ఉన్నాయి. ఎక్కడైనా చిరుత పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే అడవులు, గుట్టల వెంట తిరిగే పశువులు, మేకల కాపారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలి జిల్లాలో పలు రేంజ్‌ల పరిధిలో చిరుత పులుల సంచారం పెరిగింది. ఒక చోటు నుంచి మరోచోటుకి వెళ్లడానికి రోడ్లను దాటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పక్కనే ఉండడంతో అక్కడి ఫారెస్టు నుంచి కూడా జిల్లా అడవుల్లోకి వస్తున్నాయి. ప్రజలకు చిరుతలు కనిపించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. చిరుతల కదలికలు ఉన్నచోట ఫారెస్టు అధికారులను, సిబ్బందిని ఇప్పటికే అలర్ట్ చేశాం. – వికాస్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి -
చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్!
ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చీతాలను చూస్తున్న జనం దాదాపు అలాగే కనిపించే చిరుత పులులుగా భ్రమపడటం, మన దగ్గర ఉన్నాయిగా అనుకోవడం కూడా కనిపిస్తోంది. నిజానికి పిల్లి నుంచి పెద్దపులి దాకా అన్నీ ఒకే ప్రధాన జాతికి చెందిన జీవులు. ఇందులోనే చీతాలు, చిరుత పులులు, జాగ్వార్లు, పుమాలు వంటివి ఉప జాతులుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో ఉంటాయి. వాటి ఆకారం, పరిమాణం కూడా వేర్వేరుగా ఉంటాయి. జాగ్వార్లు పెద్దగా బరువు ఎక్కువగా ఉంటాయి. చీతాలు సన్నగా ఉండి, అత్యంత వేగంగా కదులుతాయి. చిరుతలు అయితే చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు. జూలలో ఉన్నవి పరిగణనలోకి తీసుకోరు. భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. అయితే మన హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. ఇలా జూలలో ఉన్న జంతువులను అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు. అడవులు, సహజ సిద్ధ ఆవాసాల్లో ఉండే వాటినే లెక్కల్లోకి తీసుకుంటారు. 1952 తర్వాత మన దేశంలోని అడవుల్లో ఎక్కడా చీతాలు కనిపించకపోవడంతో అంతరించిపోయినట్టు ప్రకటించారు. చీతాలు.. చిన్నవైనా వేగంగా.. ►ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు చీతాలు. కేవలం మూడు సెకన్లలోనే గంటకు 60 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగలవు. ►ఇవి 70 కేజీల వరకు బరువు.. 112 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాయి. ►శరీరం, కాళ్లు పొడవుగా ఉంటాయి. లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి. ►రాత్రిపూట కళ్లుగా సరిగా కనబడవు. అందుకే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే వేటాడుతాయి. ►3, 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి. ►చాలా వరకు ఒంటరిగా వేటాడుతాయి. అరుదుగా రెండుమూడు కలిసి వేటాడుతాయి. ►ఒకప్పుడు మన దేశంలో విస్తృతంగా ఉండేవి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనూ ఉన్నాయి. ఎక్కువగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉన్నాయి. ఉష్ణ మండల అరణ్యాలు, గడ్డి భూములను ఆవాసాలుగా చేసుకుంటాయి. మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు. చిరుతలు.. మధ్యస్థం, ప్రమాదకరం.. ►ఈ జాతి జీవుల్లో మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ. ►నాజూకుగా కనిపించే శరీరం, పొట్టి కాళ్లు, మందమైన తోక ఉంటాయి. వీటి కంటిచూపు అత్యంత చురుకైనది. చెట్లు కూడా ఎక్కగలవు. ►ఏడాది పొడవునా, ప్రధానంగా వానాకాలంలో పిల్లలను కంటాయి. అందుకే వీటి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ►ఇవి భారత ఉప ఖండం, ఆగ్నేయాసియా, సబ్ సహరన్ ఆఫ్రికా, పశ్చిమ, సెంట్రల్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువ. ►తమ ఆవాసాలు, ప్రాంతాలను బట్టి వీటి రంగులో కొంత తేడా ఉంటుంది. గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి. మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. ►ఇవి క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. మన దేశంలోని చాలాచోట్ల చిరుతలు మనుషులపై దాడిచేసిన ఘటనలు ఉన్నాయి. జాగ్వార్లు.. భారీ పరిమాణంలో.. ►ఇవి బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి. ఈ జాతిలో సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. 65 కేజీల నుంచి 140 కేజీల దాకా బరువుంటాయి. ►చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. ►ముదురు ఎరుపు, గోధుమ వర్ణంతోపాటు పసుపు (టానీ ఎల్లో కలర్) రంగులోనూ ఉంటాయి. వీటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి. ఇవి రాత్రీపగలు వేటాడగలవు. కంటిచూపు చురుగ్గా ఉంటుంది. జాగ్వార్లు నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు. -
నిర్మల్ జిల్లాలో చిరుత కలకలం
-
రోడ్లపై చిరుతలు ఎలా పరుగెడుతున్నామో చూడండి
-
కావాలోయ్ కాసింత ‘వన్య’ ప్రేమ
ఎడారిలో చలికి వణుకుతున్న ఒంటెకు తలదాచుకోవడానికి అవకాశమిచ్చిన అరబ్బు చివరకు తాను నిర్వాసితుడు కావడం మనం నీతి కథల్లో చదివే ఉంటాం. అదే గతి నేడు వన్యప్రాణులకు పడుతోంది. ఒకప్పుడు భూ విస్తీర్ణంలో డెబ్బయ్ శాతంతో కళకళలాడిన అడవులు నేడు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లింది. మనిషి జీవన అవసరాల కోసం అడవులను ధ్వంసం చేస్తూనే ఉన్నాడు. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలను కాపాడుదామని పర్యావరణ ప్రేమికులు ఎంత ఆందోళన వెలిబుచ్చినా ఇది ఆగడం లేదు. – ఆత్మకూరురూరల్ విభిన్న రకాల జీవజాతులు కర్నూలు జిల్లాలో శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం ఉంది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌తోపాటు రోళ్లపాడు, గుండ్లబ్రహ్మేశ్వరం అభయారణ్యాలు ఉన్నాయి. వీటిలో లెక్కలేనన్ని జీవజాతులు నివశిస్తున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమికీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్త రకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు. వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట నల్లమల అడవిలో ఉంది. ఇక్కడ 30 వేల మంది నివాసం ఉంటున్నారు. అటవీప్రాంతం కావడంతో గ్రామంలోకి తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వస్తుంటాయి. జనవరి 11వ తేదీ రాత్రి శ్రీశైలమాత పాఠశాల, నీటిపారుదలశాఖ సెంట్రల్ వర్క్‌షాప్ సమీపంలో ఎలుగుబంట్లు సంచరించడాన్ని స్థానికులు గుర్తించి, అటవీశాఖ సిబ్బందికి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాణాసంచా పేలుస్తూ, చప్పుళ్లు చేస్తూ వాటిని అడవిలోకి తరిమారు. అలాగే అహోబిలం, మహానంది, సర్వనరసింహస్వామి, రుద్రకోడు పుణ్యక్షేత్రాలు నల్లమల అడవిలో ఉన్నాయి. ఇక్కడ భక్తులకు తరచూ వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. జనవరి 13వ తేదీ కోవెలకుంట్లకు చెందిన ప్రసాద్ అనే భక్తుడు ఎగువ అహోబిలం నుంచి మెట్ల మార్గంలో పావన క్షేత్రం వెళ్తుండగా పొదచాటున పెద్ద పులి కనిపించడంతో భయాందోళనతో పరుగుతీశాడు. అడవి వన్యప్రాణుల నివాస స్థలం. ఎప్పుడో కాని అవి మనుషుల కంట పడవు. తమకుతాముగా అవి మనుషులకు హాని చేయవు. ఎప్పుడో ఒకసారి కనపడితే ప్రజలు ఆందోళన చేసి, అటవీ శాఖ అధికారులుపై ఒత్తిడి పెంచుతుంటారు. అటవీ నిబంధనలు పాటించాలి పులి, చిరుతలు తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు మనిషిపై దాడి చేయవు. అలాగే ఎలుగుబంటి కూడా. పులిని ఒకసారి మనం చూశామంటే అది వేయిసార్లు మనల్ని చూసే ఉంటుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ మనిషిని తప్పుకునే తిరుగుతుంది. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయని చాలా మందికి తెలియదు. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకు పోతాయి. మనుషులపై దాడి చేయవు. మనిషి నడిచి వెళితే పులులు చక్కగా గుర్తిస్తాయి. అతను తమ ఆహారపు మెనూలో లేడన్న విషయం వాటికి తెలుÜు. అదే ద్విచక్ర వాహనాలపై వెళ్లి నపుడు అది మొత్తం ఒక జంతువుగా భావించి దాడులు చేస్తాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయరాదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. మనిషి చేతిలోని కర్ర ఎత్తినపుడు ఎదురుగా ఉన్న అటవీ జంతువుకు మనిషి రెండు రెట్లు ఎత్తుగా కనిపిస్తాడు. దీంతో వన్య ప్రాణులు మనిషికి దూరంగా పారిపోతాయి. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండా ఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్యప్రాణుల ఆవాసాల్లో చొరబడి వాటిపై క్రూరత్వం ప్రదర్శించడం సరైంది కాదని వన్యప్రాణి ప్రేమికులు సూచిస్తున్నారు. అడవిపై వన్యప్రాణులదే హక్కు వన్యప్రాణుల ఆవాసాల్లోకి మనం చొరబడుతున్నాం. వన్యప్రాణులు జనవాసాల్లో తిరగడం లేదు. అడవిపై పూర్తి హక్కు వన్య ప్రాణులదే. వాటి మనుగడకు ఎవరూ అడ్డంకి కారాదు. సున్నిపెంట వంటి చోట్ల మానవ ఆవాసాల్లో వన్య ప్రాణుల సంచారం కనిపిస్తే వాటికి హాని చేయకుండా సమీప అటవీ అధికారులకు సమాచారమివ్వాలి. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్ఓ, ఆత్మకూరు -
'చిరుత పులి' రోజుకొకటి బలి!
సాక్షి, హైదరాబాద్: అంతరించడంలో చిరుతదే వేగం. పులుల కంటే వేగంగా అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వన్యప్రాణుల్లో చిరుతపులి ముందు వరసలో ఉందని జంతుప్రేమికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లోనే ఎక్కువగా చిరుతపులులు మరణించాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 218 చిరుతలు మరణించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న మనిషి, మృగం సంఘర్షణ అడవులు, పచ్చదనం తగ్గిపోతూ పట్టణీకరణ విస్తరించడంతో మనుషులు–జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. జంతువులు ముఖ్యంగా చిరుతపులులు వంటివి ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి, నివాస ప్రాంతాల్లోకి వస్తుండటంతో వాటిపై దాడులు పెరుగుతున్నాయి. వేట, గ్రామస్తుల దాడులతోపాటు బావుల్లో పడి, విద్యుత్ షాక్, రైలు,రోడ్డు ప్రమాదాలకు గురై చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఒక చిరుతపులి చనిపోతున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2018లో అత్యధికంగా 460 చిరుతలు ప్రాణాలు కోల్పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో.. 2014లో రాష్ట్ర విభజనకు పూర్వం ఉమ్మడి ఏపీలో పులుల ఆవాసప్రాంతాలు, అభయారణ్యాల్లో 345 చిరుత పులులున్నట్టుగా అంచనా. పులుల మాదిరిగా దట్టమైన అడవులు, ఆహారం, నీటికి అనువైన ప్రాంతాలు, విశాలమైన పరిసరాలకే చిరుతపులులు పరిమితం కావు. అడవుల బయట అనువైన ప్రాంతాల్లో కూడా సులభంగా ఇవి జీవించగలుగుతాయి. ఈ లక్షణాలను బట్టి ఉమ్మడి ఏపీలో అడవుల బయట 250కు తక్కువ కాకుండా చిరుతలు ఉన్నాయని పర్యావరణవేత్తల అంచనా. అయితే, 2018 నాటికి ఏపీలో 300 నుంచి 350 వరకు, తెలంగాణలో 100 నుంచి 150 వరకు చిరుతపులులుంటాయని భావిస్తున్నారు. 2014లో దేశవ్యాప్తంగా పులుల ఆవాస ప్రాంతాల్లో చిరుతల సంచారానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ సేకరించిన వివరాల ప్రకారం మొత్తం 7,872 చిరుతపులులు ఉన్నట్టు అంచనా.. అన్ని రకాలుగా కలుపుకుంటే.. మొత్తంగా 15 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. 2018కు సంబంధించి పులుల గణణ వివరాలను అధికారికంగా ప్రకటించారు. చిరుతల సంఖ్యను ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్న విధంగానే...రాజస్తాన్‌లో మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిరుతల కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ లెపర్డ్’ను ప్రారంభించాలని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ కోరుతున్నారు. -
పెంపుడు కుక్కను చంపేశాయనే కోపంతో..
హరిద్వార్ : పెంపుడు కుక్కను చంపేశాయనే కోపంతో ఓ వ్యక్తి మూడు చిరుత పులులకు విషం పెట్టి చంపేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రాజాజీ నేషనల్ పార్కులో వేర్వేరు చోట్ల మూడు చిరుత పులులు అనుమానాస్పదంగా మరణించిన విషయాన్ని ఫారెస్టు అధికారులు గుర్తించారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించగా అవి ఒకే రీతిలో మరణించాయని తెలిసింది. విషపూరితమైన కుక్కమాంసం తినడం వల్లే చనిపోయినట్లుగా ధృవీకరించుకున్న అధికారులు ఆ విషం ఫారెస్టు నర్సరీలో వాడేదిగా గుర్తించారు. దీంతో ఫారెస్టు నర్సరీలో విచారించగా సుఖ్‌పాల్ అనే వ్యక్తి నిందితుడిగా తేలింది. సుఖ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ‘తాను రెండు పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నానని, చిరుతలు దాడిచేసి ఒక దాన్ని చంపేయగా ఇంకొకటి తీవ్రంగా గాయపడిందని, దీంతో కోపం వచ్చి చిరుతలను చంపాలని నిర్ణయించుకున్నానని’ నేరాన్ని అంగీకరించాడు. సుఖ్‌పాల్ భార్య ఫారెస్టు నర్సరీలో పనిచేసే చిరుద్యోగి. ఈమె ద్వారా విషం సంపాదించిన అతను చనిపోయిన కుక్కకు విషం పూసి అడవిలో పడేశాడు. దీంతో ఇది తిన్న మూడు చిరుతలు మరణించాయి. నిందితున్ని కోర్టులో హాజరుపర్చగా 12 రోజుల కస్టడీ విధించింది. కాగా ఇదే తరహాలో మహరాష్ట్రలో ఆవుదూడను చంపిన కుక్కలను చంపాలనే కోపంతో ఓ రైతు చనిపోయిన ఆవుదూడకు విషం పూయగా దాన్ని తిని మూడు పెద్దపులి పిల్లలు మరణించడం తెలిసిందే. -
చిరుతల హల్చల్
కణేకల్లు: కణేకల్లు మండలం ఆలూరు వద్ద చిరుతల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం ఉదయం రెండు చిరుతలు ఓ జింకను చంపేడంతో గ్రామస్తులకు కంటిమీద కనుకు లేకుండా పోతోంది. ఆలూరుకి కొంత దూరంలో బుధవారం ఉదయం రైతు యువరాజు పొలంలో రెండు చిరుతలు జింకను వేటాడి చంపి తిన్నాయి. ఈ సమయంలో పక్క పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వై.నాగిరెడ్డి, రామాంజినేయులు చిరుతలను చూసి భయంతో వణికిపోయారు. జనం పోగవడంతో చిరుతలు పక్కనే ఉన్న దానిమ్మ తోటలోకెళ్లాయి. విషయాన్ని రైతు నాగిరెడ్డి ఫారెస్ట్, పోలీసుశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కళ్యాణదుర్గం ఫారెస్ట్ సిబ్బందితో పాటు కణేకల్లు పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. చిరుతదాడిలో చనిపోయిన జింకను పరిశీలించారు. అనంతరం వెటర్నరి డాక్టర్ నాగబాబుతో పోస్టుమార్టం చేయించి కాల్చేశారు. ఓ చిరుత పెద్దగా మరో చిరుత చిన్నగా ఉండటంతో తల్లిబిడ్డలై ఉంటాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. చిరుతల కదలికలను రాత్రంతా గమనించి ఫారెస్ట్‌కు వెళ్లేదాకా డ్రైవ్ చేస్తామని ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్ రాంసింగ్ తెలిపారు. రైతుల్లో భయం రెండు చిరుతుల పొదాల్లో దాక్కోవడంతో రైతులు భయంతో వణికిపోతున్నారు. చిరుతలు సంచరించిన ప్రాంత చుట్టుపక్కల పొలాల్లోకి రైతులెవరూ బుధవారం వెళ్లలేదు. ఏక్షణంలో బయటికి వస్తాయోనని భయపడి రైతులు పొలాలకెళ్లకుండా ఉన్నారు. రాత్రి పూట అవి బయటికొచ్చే అవకాశముండటంతో ఏమార్గం నుండి అవి ఫారెస్ట్‌లోకి వెళ్తాయో అర్థంకాక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పెనకలపాడు గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించి ఓ వ్యక్తిని చంపిన ఘటనను మరవక ముందే చిరుతలు జన నివాసాల మధ్యకు రావడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆందోళన చెందవద్దు చిరుత సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాంసింగ్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీజర్ శ్రీపతినాయుడు తెలిపారు. రెండు లేదా మూడు రోజుల్లోగా చిరుతలు వాటి సొంత స్థలాలకు చేరుకొనే అవకాశముందని ఈలోపు రాత్రిపూట రైతులెవరూ పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే గుంపులు, గుంపులుగా వెళ్లాలన్నారు. ఇళ్ల బయట కూడా నిద్రపోవద్దన్నారు. చిరుతల సంచారంపై డీఎఫ్‌ఓకు సమాచారమిచ్చామని అవసరాన్ని బట్టి రెస్క్యూ టీమ్‌ను రంగంలో దింపుతామన్నారు. రెండు గొర్రెలపై చిరుత దాడి శింగనమల: మండలంలోని ఆనందరావుపేటలో పెద్దసుంకన్న గొర్రెల మందపై బుధవారం రాత్రి చిరుతపులి దాడి చేసిందని గొర్రెల పెంపకందారులు తెలిపారు. గొర్రెల మందపై దాడి చేసిన రెండు గొర్రెలను ఎత్తుకెళ్లి చంపేసిందన్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన గొర్రెలను పరిశీలించి, వాటికి వెటర్నరీ వైద్యుడు నాయక్ ద్వారా పోస్ట్‌మార్టం చేయించారు. చిరుత దాడిలో దూడ మృతి శెట్టూరు: చిరుతపులి దాడిలో గేదె దూడ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చిన్నంపల్లిలో చోటు చేసుకుంది. బాధిత రైతు గంగాధర తెలిపిన వివరాల మేరకు... తనకున్న గేదెలను జడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న తన గడ్డివాము వద్ద కట్టేసి వుంచాడు. గురువారం తెల్లవారుజామున చిరుతపులి గేదె దూడపై దాడి చేసిందన్నారు. దాడిలో మృతిచెందిన గెదే దూడను తినేసి మిగిలిన భాగాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిందన్నారు. ఉదయం గడ్డివాముకు వెళ్లిన బాధిత రైతు గంగాధర చిరుతదాడిలో మృతి చెందిన గేదెను గమనించి, ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఫారెస్టు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గూడకు పోస్టుమార్టం నిర్వహించారు. -
వెలుగొండ కొండల్లో చిరుతల సంచారం
రెండు రోజుల క్రితం మేకను చంపిన చిరుత పులులు చిరుత పులలను గుర్తించిన రైల్వే కూలీలు భయాందోళనలో కొండ కింద గ్రామాల ప్రజలు డక్కిలి : వెలుగొండ కొండల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు సోమవారం ఓబులాపురం–కృష్ణపట్నం రైల్వే కూలీలు గుర్తించారు. రెండు రోజుల క్రితం వెంబులూరు గ్రామ సమీపంలోని అంబేడ్కర్‌నగర్‌కి చెందిన మేకలను చిరుత పులులు వేటాడి చంపినట్లు గుర్తించారు. సోమవారం అంబేడ్కర్‌నగర్‌కి చెందిన కొంతమంది కూలీలు రైల్వే పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా కొండలపై 5 చిరుత పులులు సంచరిస్తుండగా ప్రత్యక్షంగా చూశామని, వాటిలో రెండు పెద్దవని, మూడు చిన్నవిగా ఉన్నాయని ఆ గ్రామానికి చెందిన కూలీలు విలేకర్లకు తెలిపారు. వెలుగొండ కొండల్లో పులులు సంచరిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కొండ కింద గ్రామాల్లోని పలు గ్రామాల రైతులు మేకలు, ఆవులు, గేదెలను కొండల్లోకి మేత కోసం తోలుకుపోయేందుకు భయపడుతున్నారు. అంతేకాక గ్రామాల్లోకి చిరుత పులులు వస్తాయేమోనని భయాందోళన చెందుతున్నారు. చిరుత పులులపై సమాచారం లేదు వెలుగొండలు కొండల్లో చిరుత పులుల సంచారంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. చిరుత పులుల సెన్సెస్‌పై గతంలో ఎప్పడూ సేకరించలేదు. పెంచలకోన అడవుల్లో చిరుతలు తిరుగుతుంటాయి. ఇక్కడ చిరుత గండ్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించాం. ఏదైనా ఉంటే బేస్‌క్యాంప్ సిబ్బంది మా దృష్టికి తీసుకువస్తారు. – గోపాల్‌కృష్ణ, డీఆర్వో -
ఆవుల మందపై చిరుతల దాడి
మాచారెడ్డి: ఆవుల మందపై చిరుతలు దాడి చేయడంతో బెదిరిపోయి 15 ఆవులు పాడుబడిన బావిలో పడిపోయాయి. అందులో రెండు ఆవులు మృతి చెందాయి. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట శివారులో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లంపేటకు చెందిన ఆవుల మందను పశువుల కాపరులు ఇసాయిపేట్, అక్కాపూర్ల మధ్య ఉన్న సందుకట్ల గూడెం అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. ఒక్కసారిగా 3 చిరుతలు పశువుల మందపై దాడి చేశాయి. దీంతో బెదిరిన ఆవులు పాడుబడిన ఓ బావిలో పడ్డాయి. అందులో రెండు ఆవులు ఊపిరాడక మృతి చెందగా.. మిగతా ఆవులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన గ్రామస్తులు ఆవులను బయటకు తీసి వైద్య సేవలందించారు. -
చిరుతల కోసం గాలింపు
మాచారెడ్డి : కొద్ది రోజులుగా అక్కాపూర్, ఇసాయిపేట్ సందుకట్ల గూడెం అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇటీవల ఓ మేక, లేగదూడలపై దాడి చేసి చంపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు శనివారం ఎనిమల్ రిస్క్ వ్యాన్‌తో చిరుతను పట్టడానికి అటవీ ప్రాంతంలో సంచరించారు. బోను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పరిసర గ్రామాల ప్రజలు చిరుతలను పట్టవద్దని, అలాగే అటవీ ప్రాంతంలో ఉండనివ్వాలని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు మనుషులకు అవి తారసపడినప్పటికీ హాని తలపెట్టలేదని, చిరుతల భయంతో కలప స్మగ్లర్లు కలప జోలికి పోరని అన్నారు. ఏదేమైనప్పటికీ అధికారులు చిరుతలను పట్టడానికి చర్యలు ముమ్మరం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిణి సుజాత, బీట్ అధికారులు బద్రి, శంకరప్ప, రిస్క్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
ఆరు చిరుతల కథ..
తిరుమలలో ఎన్నడూ లేనివిధంగా చిరుతల సంచారం పెరిగిపోయింది. దీనిపై టీటీడీ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించ లేదు. జనం మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందనా లేదు. సమస్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఓ చిరుత సంచారంతో ప్రారంభమై ప్రస్తుతం ఏకంగా ఆరు చిరుతలు సంచరిస్తున్నాయి. వీటిలో రెండు చిరుతలు కాలిబాట మార్గాల్లోనే ఉన్నాయి. మరో నాలుగు చిరుతలు గోగర్భం డ్యాము నుంచి జీఎన్సీ టోల్గేట్ వరకు సంచరిస్తున్నాయి. ప్రతిరోజూ చీకటి పడిన తర్వాత ఏదో ఒకమార్గంలో స్థానికులు, భక్తులు ఉండే బాలాజీనగర్ నుంచి జీఎన్సీ టోల్గేట్ అటవీమార్గాల నుంచి జనం సంచారం ఉండే చోట్ల, నివాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. ఇప్పటి వరకు అవి కేవలం జంతువుల వేట మాత్రమే సాగిస్తున్నాయి. సోమవారం రాత్రి... సోమవారం రాత్రి ఓ చిరుత ఏకంగా నర్సింగ్ సదన్‌లోకి చొరబడింది. ముగ్గురు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అది నిష్ర్కమించేదాకా బిక్కుబిక్కుమంటూ గడిపారు. మరో మూడు కుటుంబాల భక్తులు గదుల్లోనూ గడిపి క్షేమంగా బయటపడ్డారు. సమస్యను ఎత్తిచూపిన ‘సాక్షి’ అపారమైన జంతు సంతతితో కూడిన శేషాచలం క్రూరమృగాలకు ఆవాసం. అయితే, ఎన్నడూ లేని విధంగా తిరుమల ప్రాంతంలో చిరుతల సంచారం పెరిగిందన్న విషయాన్ని ఎత్తిచూపే ప్రయత్నాన్ని సాక్షి బృందం సాహసోపేతంగా చేపట్టింది. అవి సంచరించే మార్గాలను ముందుగానే ఎంచుకుని వాహనంలో కాపు కాసింది. బాలాజీనగర్ ప్రాంతంలో ఓ దుప్పిని వేటాడుతూ వేగంగా పరుగులు తీస్తూ వచ్చిన ఓ చిరుతను క్షణాల్లోనే కెమెరాలో బంధించారు. పోలీస్క్వార్టర్స్ ప్రాంతంలో చొరబడిన జంట చిరుతల్లో వాహనం దిగి వాటిని వెంబడిస్తూ ఒక చిరుతను తమ కెమెరాలో బంధించారు. మరోసారి బాలాజీనగర్‌లో కుప్పతొట్టి వరకు వచ్చిన చిరుతను సజీవంగా ఫొటోలు తీసి చూపించారు. అయినప్పటికీ సంబంధిత విభాగాల్లో చలనం రాలేదు. నిర్లక్ష్యం వల్లే.. ఆరు చిరుతల సంచారాన్ని కట్టడి చేసే పనులు పట్టించుకోలేదు. కంటి తుడుపుగా రెండు బోన్లు పెట్టి చేతులు దులుపేసుకున్నారు. చిరుతలు బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చేశారు. దాని ఫలితంగానే సోమవారం రాత్రి ఏకంగా ఓ చిరుత అతిథిగృహంలోకి చొరబడింది. గాలింపు చర్యలు తీవ్రం కావటంతో అది కాస్త గోడ దూకి వెనుక నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. మూల్యం తప్పదు.. ఇకనైనా చిరుత సంచారం కట్టడిపై సంబంధిత విభాగాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పరిస్థితులు చేయిదాటి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. చిరుతలు రాకుండా ఇనుప కంచె నిర్మాణం చేపట్టడం వల్ల కొంత మేర కట్టడి చేసే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో టీటీడీ యంత్రాంగం పునరాలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిరుత తప్పించుకుంది..:జేఈవో శ్రీనివాసరాజు చిరుత నర్సింగ్హోంలోకి దూరింది. అక్కడి ముగ్గురు సిబ్బంది, పక్కనే ఉన్న అతిథిగృహం సిబ్బంది కూడా చూశారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ, జూ సిబ్బంది రంగంలోకి దిగారు. అతిథి గృహంలోకి వెళ్లారు. అణువణువునా గాలించారు. ఆ చిరుత అతిథిగృహం వెనుక నుంచి అడవిలోకి వెళ్లింది. చిరుత సంచారం కట్టడి చేసే చర్యలు వేగవంతం చేస్తాం. -
చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లిన వేటగాళ్లు !
ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండు మండలం అబ్బూగూడెంలో రెండు చిరుతలు మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం గుర్తించారు. దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని...రెండు చిరుతల మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్లు పెట్టిన విషాహారం తిని రెండు చిరుతలు మరణించినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుతల కాళ్లు నరికి వేటగాళ్లు తీసుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదిగో చిరుత!
తిరుమలలో చిరుతల భయం ఒకటి కాదు.. జట్లుగా సంచారం టీటీడీ, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాల నిర్లక్ష్య తీరుపై విమర్శలు భక్తులు, స్థానికుల్లో పెరిగిన ఆందోళన ఒకటికాదు.. ఏకంగా జట్లుగా ఏర్పడ్డాయి. అవి నిత్యం శివారు ప్రాంతాల్లో తిరుగుతూ జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు, స్థానికులు హడలిపోతున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన టీటీడీ ఫారెస్ట్, ప్రభుత్వ వైల్డ్లైఫ్విభాగాలు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తిరుమల : తిరుమల కొండమీద చిరుతల సం తతి పెరిగింది. ఇవి శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా సంచరిస్తూ.. స్థానికులు, భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి. తూర్పున కడప జిల్లా నుంచి పశ్చిమాన తలకోన వరకు విస్తరించిన శేషాచల అడవుల పరిధిలో దాదాపు 50కిపైగా చిరుతలు సంచరిస్తున్నట్టు అనధికారిక సమచారం. 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించిన శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం పరిధిలో సుమా రు 10, మామండూరు రేంజ్ పరిధిలో మరో 6 వరకు సంచరిస్తున్నాయి. రెండు జట్లుగా నాలుగు చిరుతల సంచారం తిరుమలలో నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నాయి. గతంలో ఒంటరిగానే తిరిగేవి. ప్రస్తుతం అవి రెండేసి చొప్పున జట్టుగా తిరుగుతున్నాయి. వీటిలో రెండు చిరుతలు గోగర్భం మఠాల నుంచి రింగ్ రోడ్డు, గ్యాస్ గోడౌన్ మీదుగా.. స్థాని కులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పు ప్రాంతం నుంచి దివ్యారామం వరకు సంచరిస్తున్నాయి. అదును చూసుకుని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే బీటైపు, డీటైపు క్వార్టర్ల వరకు తిరుగుతున్నా యి. మరో రెండు చిరుతలు జింకల పార్కు నుంచి అవ్వాచ్చారి కోన, అలిపిరి కాలిబాట మార్గం మీదుగా దివ్యారామం, రెండో ఘాట్ రోడ్డు ద్వారా శ్రీవారి మెట్టు వరకు తిరుగుతున్నాయి. చీకటిపడితే భయం ఈ నెల మొదటి వారం నుంచి చిరుతల సంచారం పెరిగింది. తరచూ ఇవి ఏదో ఒక చోట జనం కంట కనబడుతున్నాయి. వాటిని తమ సెల్ఫోన్లలో బందిస్తూ ఆ సమాచారాన్ని ఎప్పడికప్పుడు సామాజిక మాధ్యమాల్లో బదిలీ చేస్తున్నారు. ఎప్పు డు ఏ మార్గంలో చిరుత వస్తుందోనని భక్తులతోపాటు స్థానికుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఆలయంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేసే టీటీడీ ఉద్యోగులు, కార్మికులతో పాటు దుకాణదారులు నివాస ప్రాంతాలకు 24 గంటలు వెళ్లివస్తుంటారు. చిరుతల సంచారంతో వారు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లకు ముందు అలిపిరి కాలిబాటలో సంచరించే రెండు చిరుతల్ని బోన్లు ఏర్పాటు చేసి బంధించిన తరహాలోనే, ప్రస్తుతం సంచరించే వాటిని కూడా పట్టుకోవాలి. అనుకోని ఘటన జరిగితే దాని ఫలితంగా టీటీడీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సంతాన ఉత్పత్తికోసమే.. సాధారణంగా చిరుతలు ఒంటరిగానే వేట సాగిస్తాయి. అవి కేవలం సంతాన ఉత్పత్తి (హీట్)కు వ చ్చిన సందర్భంలో జట్లుగా కలసికట్టుగా తిరుగుతుం టాయి. ఆ సమయంలో వాటి ఆలోచన కేవలం సంతాన ఉత్పత్తి తప్ప మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ చిరుతలు కని పిస్తే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చర్యలు వేగవంతం చేస్తాం చిరుతల వల్ల ఎలాంటి భయం లేదు. అవి మనుషుల మీద దాడి చేసే స్వభావం చాలా తక్కువ. వాటికి మనుషులను చూస్తేనే భయం ఎక్కువ. అయినప్పటికీ చిరుతల సంచారంతో వాటి పాద ముద్రలు సేకరిస్తాం. వాటి కట్టడి చర్యలు తీవ్రతరం చేస్తాం. దీనిపై భక్తులు, స్థానికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - శివరామ్‌ప్రసాద్, టీటీడీ డీఎఫ్‌వో -
కునుకు లేదు గోవిందా!
తిరుమలలో మూడు చిరుతల సంచారం ఆందోళనలో భక్తులు తిరుమల: చిరుతలు తిరుమల స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తిరుమలకొండ చుట్టూ విస్తరించిన శేషాచ లంలో సుమారు 50 దాకా చిరుతలు ఉన్నాయి. వీటి లో మూడు చిరుతలు కేవలం తిరుమల శివారు ప్రాంతాల్లో మాత్రమే సంచరిస్తున్నా యి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు స్థానిక నివాస ప్రాంతమైన బాలాజీనగర్ తూర్పుప్రాంతం, గ్యాస్ గోడౌన్, ఎస్వీ హైస్కూల్ ప్రాంతాల్లో సంచరించాయి. తూర్పుప్రాంతంలో ఓ చిరుత నిద్ర కు ఉపక్రమించడం గమనార్హం. ఇక గ్యాస్ గూడౌన్ నుంచి వచ్చిన మరో చిరుత ఎస్వీ హైస్కూల్లో చెట్టు ఎక్కింది. దీంతో స్థానికు లు, సిబ్బంది పెద్దఎత్తున శబ్దాలు చేయడంతో అవి అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. ఈ మూడు చిరుతల పట్టివేతపై అటవీశాఖాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో 24 గంటలూ జనం సంచారం ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖాధికారులు కూడా తక్షణ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మళ్లీ చిరుతల సంచారం!
- జోరుగా ప్రచారం భయం గుప్పిట్లో గ్రామాలు - వ్యవసాయ పొలాల్లో సంచరిస్తున్నట్టు ధ్రువీకరణ - ఆనవాళ్లు గుర్తించిన అటవీ అధికారులు కొల్చారం : చిరుత పులులు మళ్లీ సంచరిస్తున్నట్టు ప్రచారం జరగడంతో జనం బెంబేలు చెందుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందోననే భయం వారిలో నెలకొంది. ఈ నెల ఒకటిన మండలంలోని తుక్కాపూర్‌లో చిరుత కలకలం రేపి తొమ్మిది మందిని గాయపర్చిన ఘటన తెల్సిందే. చిరుతపులిని బంధించేందుకు అటవీ అధికారులు, ప్రజలు సుమారు ఆరున్నర గంటలపాటు శ్రమించి వలలో బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగి పక్షం రోజులు కావడం మరోమారు మండలంలో చిరుతపులులు సంచరిస్తున్నాయన్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కొల్చారం మండలంలోని మంజీర పరీవాహక గ్రామాలైన కోనాపూర్, పైతర గ్రామ శివారులలో రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని ప్రత్య క్ష సాక్షులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో కోనాపూర్‌కు చెందిన వెంకటేశ్వరరావు పొద్దుతిరుగుడు పంటలో రెండు పులులు సంచరించినట్లు తెలిపాడు. అదే రోజు సాయంత్రం 6:30గంటల సమయంలో గ్రామ సమీపంలోని మంజీర వాగు వద్ద లక్ష్మణ్‌రావుకు చిరుతపులి కంటపడినట్లు గ్రామస్థులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు చిరుత పులుల సమాచారాన్ని స్థానిక తహశీల్దార్, ఎస్ఐలకు తెలియజేశారు. రాత్రి పొద్దుపోయాక సమాచారం బయటకు రావడంతో సోమవారం ఉదయం మెదక్ అటవీశాఖకు చెందిన అధికారులు రేంజ్ అధికారి శ్యామ్‌రావు, సెక్షన్ అధికారి శాంతన్గౌడ్లు కోనాపూర్ గ్రామాన్ని సందర్శించి చిరుతపులి కనిపించిన ప్రదేశాలను పరిశీలించారు. రేంజ్ అధికారి శ్యామ్‌రావు మాట్లాడుతూ చిరుతపులి సంచరించిన ప్రదేశాలను పరిశీలించామని వాటి అడుగులు కనిపించినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
చిరుతల సంఖ్య తేలింది
చిరుతపులుల జనసంఖ్యపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. స్వాతంత్ర్యానంతరం వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేపట్టిన చిరుత పులుల జనగణనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం భారత్‌లో 12 వేల నుంచి 14 వేల చిరుతపులులు ఉన్నాయని, పులుల సంఖ్య (7,910)తో పోల్చిచూస్తే ఈ సంఖ్య మెరుగైనదని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్, చిరుతపులుల జనగణన ముఖ్యఅధికారి యదువేంద్రదేవ్ ఝా చెప్పారు. డెహ్రాడైన్లో జరిగిన వార్షిక పరిశోధనా సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చిరుతల సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడక్కడా నైట్‌విజన్ కెమెరాలను ఏర్పాటుచేసి ఫోటోలు తీశామని, ఇతర ప్రాంతాల్లోనూ వివిధ మార్గాల ద్వారా ఫొటోలను సేకరించామని, అన్నింటిని క్రోడీకరించిన పిదప దేశంలో చిరుత పులుల రమారమి జనాభాను అంచనావేయగలిగామని ఝా చెప్పారు. పులుల జనగణనను కూడా ఇవే పద్దతుల ద్వారా సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, ఈశాన్య భారతంలో ఇంకా సర్వే చేపట్టలేదని, ఆ వివరాలను కూడా కూడితే చిరుతపులుల జనసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 343 చిరుతపులులు ఉండగా మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,817, కర్ణాటకలో 1,129, మహారాష్ట్రలో 905, ఛత్తీస్‌గఢ్ లో 846, తమిళనాడులో 815, ఉత్తరాఖండ్ లో 703, హిమాలయ ప్రాంతంలో 300 నుంచి 400 చిరుతపులులు జీవిస్తున్నాయి. -
బాలాజీనగర్‌కు చిరుతల భయం
తిరుమలలో చిరుతల సంచారం పెరిగిపోయింది. బాలాజీనగర్ వాసులు కంటి మీద కునుకులేకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తిరుమల: బాలాజీనగర్‌లోని తూర్పు ప్రాంతంలో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి కాకుల కొండ మీదుగా డంపింగ్‌యార్డ్ వద్ద అవి తిరుగుతాయి. చీకటి పడిన తర్వాత స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పు ప్రాంతానికి చేరుకుంటాయి. రాత్రి 10 గంటలకు జనం చప్పుడు తగ్గిన తర్వాత రాకపోకలు సాగిస్తున్నాయి. గంటల తరబడి తూర్పు ప్రాంతం నుంచి పాచికాల్వ గంగమ్మ గుడి ప్రాంతం వరకు ఉండే ఇళ్ల ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిపోయింది. పొంచిఉన్న ప్రమాదం బాలాజీనగర్ ప్రాంతంలో పగలు, రాత్రి లేకుండా చిరుతలు సంచరిస్తున్నాయి. ఇవి ఎవరిపైనైనా దాడి చేసే అవకాశం ఉంది. బాలాజీనగర్ వాసులు తూర్పుప్రాంతంలోని నీటి గుంట వద్ద బట్టలు ఉతికేందుకు వెళుతుంటారు. ఆ ప్రాంతం అంతా దట్టమైన చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. సీసీ కెమెరా పెట్టే ఆలోచనలో ఫారెస్ట్ అధికారులు ఇటీవల కాలంలో చిరుతల సంచారం పెరిగిపోవడంతో సీసీ కెమెరాలు పెట్టాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నిత్యం అవి వచ్చివెళ్లే దారుల్లో సీసీ కెమెరాలు పెట్టి వాటి జాడలు గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చిరుతల సంచారం నిర్దారించాక పరిస్థితి అధికమిస్తే వాటిని పట్టుకునేందు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. -
అనంత, కర్నూలు, తిరుపతిలో చిరుతల హల్చల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని వేదిక్ వర్సిటీ, రుయా ఆస్పత్రి ప్రాంగణాల్లో చిరుత కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. వేదిక్ యూనివర్సిటీ వద్ద చిరుతల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చిరుతల కోసం బోనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తిరుపతిలోనే కాదు.. అనంతపురం జిల్లా పెనుకొండలోని.. రాజేశ్వరి కాలనీలో కూడా చిరుత సంచరిస్తున్న్లు తెలుస్తోంది. పెనుకొండలో గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. రెండు గొర్రెలు మృతి చెందాయి, అలాగే కర్నూలు జిల్లా చిరుతన్కల్లో కూడా చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తుంది. చిరుతల సంచారంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. -
వన్యప్రాణుల నడుమ...వనయాత్ర చేద్దామా
మన దగ్గరే... కాలుష్యపు పొగలు, వేసవి సెగల మధ్య ఉరుకులు పరుగులూ పెడుతూ... ఏమిటో ఈ జీవితం అని నిట్టూరుస్తూ గడపడం ప్రస్తుతం తప్పనిసరే అయినా... అప్పుడప్పుడూ తప్పించుకోవడం అవసరం. కాంక్రీట్ జంగిల్ అంటూ తిట్టుకున్నంత మాత్రాన వచ్చేదీ లేదు... నిజమైన జంగిల్లో కాసేపు గడిపినా ప్రాణం బోలెడు రీఛార్జ్ అవకుండా పోదు. వారమంతా విరామమెరుగని ‘వార్’ సాగించేకంటే... ఒక్కరోజైనా ఆ జంఝాటం నుంచి తప్పించుకోవాలని ఆశించే ఆనందాన్వేషకులకు మరో చక్కని గమ్యం ఆదిలాబాద్‌లోని జన్నారం. హైదరాబాద్ నుంచి దాదాపు 280 కి.మీ దూరంలో ఉంది ఆదిలాబాద్ జిల్లా. ఈ జిల్లా వేదికగానే దట్టమైన అడవుల అందాన్ని సురక్షితమైన, భద్రమెన రీతిలో తిలకించి ఆనందించే మరో మంచి అవకాశం ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి వచ్చింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్ల పుణ్యమా అని ఆదిలాబాద్‌లోని అడవుల్లో సాహసికులు అభిలషించే సాహసయాత్ర కల సాకారం కానుంది. జన్నారం ప్రాంతంలోని కవ్వాల్ అభయారణ్యంలో ఎకోట్రాక్లు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పులుల సంచార ప్రాంతంగా గుర్తించడంతో ఇక్కడ ఎకోట్రాక్లు అందుబాటులోకి రానున్నాయి. బస ఏర్పాట్లు కవాల్ టైగర్ శాంచ్యురీకి దగ్గర్లో ఎపిటిడిసి కాటేజ్‌లు నిర్మించింది. ప్రకృతి సిద్ధ అందాలను ఆస్వాదిస్తూ, ఇక్కడ ఉన్న అధునాతన వసతుల్ని ఆనందించేలా వీటిని రూపుదిద్దారు. 9 ఎసి కాటేజ్‌లు, 2 నాన్ ఎసి కాటేజ్‌లు ఇక్కడున్నాయి. ఒక డార్మెటరీ కాటేజ్‌ను కూడా నిర్మించారు. దాదాపు 50 సీట్లున్న రెస్టారెంట్ నెలకొల్పారు.‘‘ఇక్కడ ట్రెక్కింగ్ తదితర సాహసయాత్రలు, జీప్ సఫారీ పరిచయం చేయనున్నాం. ఎకో ట్రాక్ మీద టూర్లు నిర్వహించేందుకు ఇప్పటికే ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యువి)ని అందుబాటులోకి తెచ్చా’’మని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల సందడి జింకలు, అడవి కుక్కలు, విచిత్రమైన కొండముచ్చులతో పాటు... ఇక్కడ 10 చిరుత పులులు, 48 ఎలుగుబంట్లు, 20 నక్కలను గుర్తించినట్టు స్థానిక అటవీ అధికారి చెప్పారు. మొత్తం 893 కి.మీల విస్తీర్ణంలో ఉందీ వన్యప్రాణి రక్షితప్రాంతం. స్థానికంగా నివసించే వాటి కన్నా చండీగఢ్ వంటి ప్రాంతాల్లోని అడవుల నుంచి రాకపోకలు సాగించే పులులే ఇక్కడ అధికమని అటవీ అధికారులు వివరిస్తున్నారు. జల విహారం కవాల్ అభయారణ్యానికి కేవలం 30కి.మీ దూరంలో ఉంది కడెమ్ రిజర్వాయర్. జలజలపారే నీళ్లు, మధ్యలో చిన్న దీవి వగైరాలతో పర్యాటకులకు వినూత్న అనుభూతుల్ని అందిస్తోంది. ఇక్కడ బోటింగ్ సదుపాయముంది. సాయంత్రవేళల్లో జల విహారం మధురానుభూతి. సిద్ధమవుతున్న టూర్ ప్యాకేజి హైదరాబాద్-బాసర-అలీసాగర్-హైదరాబాద్‌లతో 3 రోజుల టూర్, అలాగే హైదరాబాద్-బాసర-జన్నారం-అలీసాగర్-హైదరాబాద్‌లతో 5 రోజుల టూర్‌కు పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తోంది. - ఎస్. సత్యబాబు