కునుకు లేదు గోవిందా!
తిరుమలలో మూడు చిరుతల సంచారం
ఆందోళనలో భక్తులు
తిరుమల: చిరుతలు తిరుమల స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తిరుమలకొండ చుట్టూ విస్తరించిన శేషాచ లంలో సుమారు 50 దాకా చిరుతలు ఉన్నాయి. వీటి లో మూడు చిరుతలు కేవలం తిరుమల శివారు ప్రాంతాల్లో మాత్రమే సంచరిస్తున్నా యి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు స్థానిక నివాస ప్రాంతమైన బాలాజీనగర్ తూర్పుప్రాంతం, గ్యాస్ గోడౌన్, ఎస్‌వీ హైస్కూల్ ప్రాంతాల్లో సంచరించాయి. తూర్పుప్రాంతంలో ఓ చిరుత నిద్ర కు ఉపక్రమించడం గమనార్హం.
ఇక గ్యాస్ గూడౌన్ నుంచి వచ్చిన మరో చిరుత ఎస్‌వీ హైస్కూల్‌లో చెట్టు ఎక్కింది. దీంతో స్థానికు లు, సిబ్బంది పెద్దఎత్తున శబ్దాలు చేయడంతో అవి అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. ఈ మూడు చిరుతల పట్టివేతపై అటవీశాఖాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో 24 గంటలూ జనం సంచారం ఉండే ఈ ప్రాంతంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖాధికారులు కూడా తక్షణ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.