చిక్కిన చిరుత
కుల్కచర్ల/హన్వాడ, న్యూస్‌లైన్: రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి వలలో చిక్కింది. మంగళవా రం రాత్రి చిరుత చిక్కగా, బుధవారం దానిని హైదరాబాద్‌కు తరలిం చారు. స్థానికులు, అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం.. చాకల్‌పల్లి అటవీ ప్రాంతం సమీపంలో రైతుల పొలాలున్నాయి. ఇక్కడ వేరుశనగ పంటలు పండిస్తున్నారు. ఈ పంటలను అడవిపందులు నాశనం చేస్తుం డగా, పలువురు రైతులు పంటను కాపాడుకునేందుకు వలలు ఏర్పాటు చేశారు. అయితే, కొంతకాలంగా ఈ అటవీ ప్రాంతంలో ఓ చిరుతపులి సంచరిస్తోంది.
లేగదూడలను, ఆవులను చంపి తింటోంది. మంగళవా రం రాత్రి అడవిపందుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిరుతపులి చిక్కుకుంది. బుధవారం వేకువజామున స్థానికులు వెళ్లి చూడగా, వల లో చిక్కన చిరుత కనిపించింది. దీంతో అటవీ అధికారులకు, కుల్కచర్ల పోలీసులకు సమాచారం అందించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి బోను, మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్‌ను పిలిపించారు. చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తరువాత దాన్ని బోనులో హైదరాబాద్‌కు తరలించారు.