కోటపల్లి, న్యూస్‌లైన్: రావులపల్లికి చెందిన జంగ జనార్దన్‌రెడ్డి, సుగుణ అనే వ ృద్ధ దంపతుల ఇంట్లోకి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంటి వెనుక గుమ్మం గుండా దొంగలు చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా చప్పుడు కావడంతో మేల్కొన్న జనార్దన్, సుగుణ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దొంగలు ఇంట్లో ఉన్న కత్తి పీట, కొడవళ్లతో వారిపై విచక్షణరహితంగా దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకూలారు.
దొంగలు సుగుణమ్మ మెడలోని అరతులం బంగారు గొలుసు, 15 తులాల వెండి పట్టగొలుసులు తీసుకొని పరారయ్యారు. తెల్లవారుజామున ఇంటి ముందు నివాసం ఉంటున్న వారు విషయం తెలుసుకొని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని కరీంనగర్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని చెన్నూర్ టౌన్, రూరల్ సీఐలు భద్రయ్య, చంద్రభాను, ట్రైనీ ఎస్సై టి.శ్రీకాంత్ పరిశీలించారు. సంఘటన స్థలంలో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
దోపిడీ దొంగల బీభత్సం
Published Sat, Jan 4 2014 2:53 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement