campfire
-
పాతనోట్లు చలిమంట
రాయచూరు రూరల్: అది రాయచూరు నగరంలోని గంజ్ సర్కిల్ ప్రాంతం. ఒక మూలన ఏవో కాగితాలు తగలబడుతున్నాయి. కొందరు అనుమానం వచ్చి చూస్తే.. అవి 500, 1000 రూపాయల నోట్లు. దీంతో గగ్గోలు మొదలైంది. కాకపోతే అవి రద్దయిన పాత నోట్లు. ఇక్కడి ఏపీఎంసీ మార్కెట్లోని వ్యాపారులు ఎవరైనా పాత నోట్లను అలాగే ఉంచుకుని ఉంటారు, మార్పిడికి చేతకాక అంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాత కరెన్సీ నోట్లను కాల్చి బూడిద చేశారు. దీనిపై మార్కెట్ యార్డ్ ఎస్ఐ అగ్ని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమాచారం తెలియగానే జిల్లా ఇన్చార్జ్ మంత్రి వెంకటరావ్ నాడగౌడ ఘటన స్థలాన్ని సందర్శించారు. పాతనోట్ల రద్దయిన దాదాపు రెండేళ్ల తరువాత కూడా అవి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎంతమొత్తంలో కాల్చి ఉంటారనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
చలిమంటలో పడి మహిళ సజీవ దహనం
విశాఖపట్టణం: చలిమంట ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం నర్తనపల్లిలో చిలకమ్మ అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున చలిమంట కాగుతోంది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆమె ఆ మంటల్లో పడింది. చుట్టుపక్కల వారు రక్షించేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. -
చలిమంటలో పడి చిన్నారి మృతి
వరంగల్: దురదృష్టవశాత్తూ చలిమంటలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామశివారు వడ్డెరగూడెంలో జరిగింది. తల్లిదండ్రులతో కలిసి ఇంటి వద్ద చలి మంట కాచుకుంటున్న సుర వర్షిణి ప్రమాదవశాత్తు మంటలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
భోగి మంటల్లో పేలిన 'హిట్' స్ప్రేయర్
ధర్మారం (డిచ్పల్లి) : సంక్రాంతి భోగి మంటలు ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం తెచ్చిపెట్టాయి. భోగి మంటల్లో వేసిన దోమల మందు స్ప్రేయర్ 'హిట్' ట్యూబ్ పగలటంతో చిన్నారితోపాటు ముగ్గురు గాయాలపాలయ్యారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చెందిన రాకోలు సాయి, రమాదేవి దంపతులు తమ కుమారుడు రితేష్(3), వారి బంధువు శివకృష్ణతోపాటు గురువారం ఉదయం ఇంటి ముందు భోగి మంట వేసి అందులో పాత వస్తువులను పడవేసి అక్కడే కూర్చున్నారు. వాటిలో దోమలు, బొద్దింకలను చంపడానికి వాడే 'హిట్' స్ప్రేయర్ కూడా ఉంది. మంటల వేడికి బాటిల్ పేలి దాంట్లో మిగిలి ఉన్న మందు ఎగజిమ్మి అందరి ముఖాలు, చేతులపై పడింది. స్ప్రేతో పాటు మంటలు అంటుకున్నాయి. కుటుంబసభ్యులు వారిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలైన బాలుడు రితేశ్కు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. -
చలి మంట అంటుకుని యువతి మృతి
కోటపల్లి (ఆదిలాబాద్) : చలి మంట వద్ద కూర్చున్న యువతి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రగాయాలతో చనిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కోటపల్లిలో చోటుచేసుకుంది. కోటపల్లికి చెందిన రంగు ముత్తయ్య, మల్లక్క దంపతుల కుమార్తె మానస(18) ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం ఆమె చలి మంట వద్ద కూర్చుని ఉంది. మంట సరిగా రాకపోవటంతో కుటుంబసభ్యులు కిరోసిన్ చల్లారు. దాంతో ఒక్కసారిగా మంటలు రేగి మానస దుస్తులకు అంటుకున్నాయి. వారు ఆర్పేలోగానే ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు మొదట చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూర్ రూరల్ సీఐ రాములు తెలిపారు. -
పురుడు
ఉగాది కవిత చలిమంట కొడిగట్టిన దీపంలా కొండెక్కి పోతుంది నీరెండ.. నివురుగప్పిన నిప్పును రాజేస్తుంది. అడవితల్లి ఆకునంతా రాల్చుకుని నగ్నాకృతిగా మారిపోతుంది. గాలి.. గంధాన్ని పూసుకొని నేలనంతా నెమరువేస్తుంది. శబ్దదృశ్యమయ ద్వంద్వమ ఏకమైపోతే కాలము నీళ్లోసుకుంటుంది. ప్రకృతిమాత పరవశిస్తూ చిగురు శిశువుకు పురుడు పోస్తుంది. రుతువులు మారిపోతున్న తరుణాన కోకిల పాటల ఊయలలూగుతుంది. తుమ్మెదలు, తేనెటీగలు కీచురాళ్లు, కీటకాలు పరిమళిస్తే వసంతగీతం పల్లవిస్తే విశ్వ సంగీతం. - అంద్శై 9848460986