పురుడు
ఉగాది కవిత
చలిమంట కొడిగట్టిన దీపంలా కొండెక్కి పోతుంది
నీరెండ.. నివురుగప్పిన నిప్పును రాజేస్తుంది.
అడవితల్లి ఆకునంతా రాల్చుకుని నగ్నాకృతిగా మారిపోతుంది.
గాలి.. గంధాన్ని పూసుకొని నేలనంతా నెమరువేస్తుంది.
శబ్దదృశ్యమయ ద్వంద్వమ ఏకమైపోతే కాలము నీళ్లోసుకుంటుంది.
ప్రకృతిమాత పరవశిస్తూ చిగురు శిశువుకు పురుడు పోస్తుంది.
రుతువులు మారిపోతున్న తరుణాన కోకిల పాటల ఊయలలూగుతుంది.
తుమ్మెదలు, తేనెటీగలు కీచురాళ్లు, కీటకాలు పరిమళిస్తే వసంతగీతం పల్లవిస్తే విశ్వ సంగీతం.
- అంద్శై 9848460986