యువకుడిపై కేసు నమోదు | Ten years jail for a young man in a case of death in the accident | Sakshi
Sakshi News home page

యువకుడిపై కేసు నమోదు

Published Thu, Sep 28 2017 3:41 AM | Last Updated on Thu, Sep 28 2017 3:49 AM

Ten years jail for a young man in a case of death in the accident

ప్రతీకాత్మక చిత్రం

టెక్కలి: టెక్కలి మండలం లింగాలవలస సమీపంలో ఈ నెల 25న జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో జీరు రాజేశ్వరి అనే యువతి మృతి చెందిన కేసులో బాధ్యుడైన యువకుడిపై పదేళ్ల జైలు శిక్ష కలిగిన సెక్షన్‌లు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ కె.భవానిప్రసాద్‌ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ సంతబొమ్మాళి మండలం యామాలపేటకు చెందిన రఘు డిల్లేశ్వరరావు (అలియాస్‌ వినోద్‌) అదే మండలం  మూలపేటకు చెందిన జీరు రాజేశ్వరితో ద్విచక్రవాహనంపై మితిమీరిన వేగంతో పాతపట్నం నుంచి వస్తుండగా లింగాలవలస సమీపంలో యువతి జారి పడటంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనికి కారకుడైన యువకుడికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం ప్రధాన నేరంగా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. పదేళ్ల పాటు జైలు శిక్ష కలిగిన 304 పార్ట్‌–2లో భాగంగా కల్ప్‌బుల్‌ హోమిసైడ్‌ నాట్‌ ఎమాంటింగ్‌ టు మర్డర్‌’ అనే కఠినతరమైన సెక్షన్‌ను యువకుడిపై నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన వ్యక్తులపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై, డ్రైవింగ్‌ అర్హత లేకుండా వాహనాలు నడిపిన మైనర్లపై ఈ సెక్సన్‌ అమలు చేస్తామని చెప్పారు.  వాహన యజమానులకు సైతం ఇదే సెక్షన్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement