Ten years in prison
-
అత్తింటివారికి పదేళ్ల జైలు
సిద్దిపేటటౌన్/నంగునూరు(సిద్దిపేట) : అదనపు కట్నం కావాలంటూ వివాహితను వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామలకు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి పది సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుట్ట రేణుకను నంగునూరు మండలం నర్మెట గ్రామానికి చెందిన పుట్ట రాజుకు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 50 వేల నగదు, 3 తులాల బంగారం, రూ. 60 వేల విలువైన వెండి వస్తువులు కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కొడుకు, కూతురు జన్మించారు. పెళ్లయిన ఏడాది నుంచే భర్త రాజు, అత్త, మామలు ఐలవ్వ, చంద్రయ్యలు అదనపు కట్నం రూ. 50 వేలు తేవాలంటూ వేధించారు. ఈ విషయం రేణుక తల్లిదండ్రులకు తెలియడంతో పెద్దల సమక్షంలో రెండు, మూడు సార్లు పంచాయతీ పెట్టి రేణుకను కాపురానికి పంపించారు. అయినా రాజు కుటుంబ సభ్యుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా వేధించడం ఎక్కువ కావడంతో తట్టుకోలేక 2015 అక్టోబర్ 12న వంట గదిలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన భర్త, అత్త, మామలు మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అదనపు కట్నం తేవాలని హింసించడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు మరణ వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత రేణుక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించింది. రేణుక ఇచ్చిన మరణ వాంగ్మూలం మేరకు రాజగోపాల్‌పేట ఎస్సై గోపాల్‌రావు కేసు నమోదు చేశారు. అనంతరం సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ కేసును పరిశోధించి రేణుక భర్త పుట్ట రాజు (30), అత్త ఐలవ్వ (50), మామ రాజయ్య(60)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసు విచారణ చేసి కోర్టులో చార్జిషీట్ వేయగా అప్పటి నుంచి కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం నిందితులపై నేరం రుజువైన నేపథ్యంలో జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి ప్రతిమ నేరస్తులకు పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 54 వేల జరిమానా విధించారు. -
బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష
రాజమహేంద్రవరం క్రైం : మైనర్‌పై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. చింతూరు ఎస్సై శ్రీనివాస కుమార్ కథనం ప్రకారం.. 2015 నవంబర్ 28న చింతూరుకు చెందిన తిలపురెడ్డి సాయి మణికంఠ, చింతూరు జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న బాలికను కాలేజీ వెనుకకు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలికను వివాహం చేసుకోమంటే కులం తక్కువ అని నిరాకరించాడు. ఈ సంఘటన పై అప్పటి చింతూరు ఎస్సై గజేంద్ర కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సుంకర మురళీ మోహన్ దర్యాప్తు చేసి కేసును రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్ కోర్టులో విచారణ నిమిత్తం పంపారు. కేసును విచారణ చేసిన ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కిషోర్ కుమార్ తీర్పు ఇస్తూ నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతోపాటురూ.వెయ్యిజరిమానావిధిస్తూ తీర్పు ఇచ్చారు. -
యువకుడిపై కేసు నమోదు
టెక్కలి: టెక్కలి మండలం లింగాలవలస సమీపంలో ఈ నెల 25న జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో జీరు రాజేశ్వరి అనే యువతి మృతి చెందిన కేసులో బాధ్యుడైన యువకుడిపై పదేళ్ల జైలు శిక్ష కలిగిన సెక్షన్లు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ కె.భవానిప్రసాద్ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ సంతబొమ్మాళి మండలం యామాలపేటకు చెందిన రఘు డిల్లేశ్వరరావు (అలియాస్ వినోద్) అదే మండలం మూలపేటకు చెందిన జీరు రాజేశ్వరితో ద్విచక్రవాహనంపై మితిమీరిన వేగంతో పాతపట్నం నుంచి వస్తుండగా లింగాలవలస సమీపంలో యువతి జారి పడటంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనికి కారకుడైన యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం ప్రధాన నేరంగా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. పదేళ్ల పాటు జైలు శిక్ష కలిగిన 304 పార్ట్–2లో భాగంగా కల్ప్బుల్ హోమిసైడ్ నాట్ ఎమాంటింగ్ టు మర్డర్’ అనే కఠినతరమైన సెక్షన్‌ను యువకుడిపై నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వ్యక్తులపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై, డ్రైవింగ్ అర్హత లేకుండా వాహనాలు నడిపిన మైనర్లపై ఈ సెక్సన్ అమలు చేస్తామని చెప్పారు. వాహన యజమానులకు సైతం ఇదే సెక్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
రూ. 2.25 లక్షల జరిమానా విజయవాడ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.2,25,000 జరిమానా విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి కం ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎ.గిరిధర్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన నిందితుడు బొజ్జా సురేష్ తన కుటుంబంతో నివశిస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య ఇద్దరి పిల్లలను భర్తను వదలి వెళ్లిపోయింది. అదే ప్రాంతంలో నివశిస్తున్న దూరపు బంధువైన మైనర్ బాలికపై నిందితుని కన్ను పడింది.ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి 2013,ఆగష్టు 18న నాగపట్నం వెళ్లి వద్దామని చెప్పాడు. మరుసటి రోజు ఇద్దరు కలసి చెన్నై వె ళ్లారు.అక్కడ నుంచి నాగపట్నం చేరారు. అక్కడే బాలికను నిందితుడు వివాహం చేసుకున్నాడు. 15 రోజుల పాటు అక్కడే ఉంచి ఆ బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరానికి చేరుకున్న బాలిక విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బెల్లపు సత్య నారాయణ 11 మంది సాక్షులను విచారించారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కిడ్నాప్‌నకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా, లైంగిక దాడికి పదేళ్ల జైలుశిక్ష తోపాటు, రూ. 2 లక్షలు జరిమానా విధిస్తూ,శిక్ష ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
లైంగిక దాడిలో నిందితునికి పదేళ్లు జైలు
యాకుత్‌పురా: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితునికి కోర్టు బుధవారం పదేళ్లు జైలు శిక్ష విధించింది. మీరాలంమండి ముర్గీఖానా ప్రాంతానికి చెందిన మహ్మద్ ఉస్మాన్ కుమారుడు మహ్మద్ సల్మాన్ (20) 2013 డిసెంబర్ 17వ తేదీన మైనర్ బాలిక (13)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో సల్మాన్‌తో పాటు మరో ముగ్గురు జూవైన ల్లపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో నిందితున్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో కొనసాగుతున్న ఈ కేసుపై బుధవారం ఒకటవ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి. లక్ష్మీపతి సల్మాన్‌కు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించి * 1000 ల జరిమానాను ఖరారు చేశారు.