తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమార్తె, బంధువులు
రాయచోటిటౌన్: ఆమె పూజలో కూ ర్చుంది.. పూజ ప్రారంభమైంది.. అలా కూర్చున్న చోటనే నేలకొరిగింది. ఉదయం నుంచి ఉపవాసం ఉండటంతో నీరసించి ఉంటుందని అక్కడి వారు అం దరూ సపర్యలు చేశారు. కానీ ప్రయోజనం లేదు. అప్పటికే ఆమెను మృత్యువు ఆహ్వానించింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటి డైట్ పాఠశాలలో హిందీ పం డిట్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి, రత్నమ్మ (47) దంపతులు పట్టణంలోని గున్నికుంట రోడ్డుకు దగ్గరగా ఉన్న అల్తాఫ్ కల్యాణ మండపం సమీపంలో నివా సం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వారికి వివాహాలు అయ్యాయి. శుక్రవారం రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వేలాది మంది ముత్తయిదువులతో కలసి సామూహిక వరలక్ష్మి వ్రతం చేపట్టారు.
ఆ పూజలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని తెల్లవారు జామునే ఇంటిలోని పనులన్నీ పూర్తి చేసి 8గంటలకు ఉపవాసంతో ఆలయానికి చేరుకొంది. ఇంతలో ఒక్కసారిగా ఆమె ముందుకు వాలిపోయింది. ఆమె అనారోగ్యానికి గురై ఉంటుందని భావించి అక్కడి వారు ప్రాథమిక చికిత్స చేశారు. కానీ ఆమె స్పృహ కోల్పోయి పడి ఉండటంతో వెంటనే ఆటోలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె భర్త తమిళనాడులోని తిరుణామళైలో బంధువుల పెళ్లికి వెళ్లి ఉన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment