varalaxmi Vratham
-
పూజలో వదిన మరదళ్లు.. ఎంత చూడచక్కగా ఉన్నారో! (ఫోటోలు)
-
వరలక్ష్మీ వ్రతం స్పెషల్: రూ. 31.25 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తెలుగు లోగిళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తూర్పగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని ముసలమ్మ తల్లి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు సుమారు ₹13.25 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో జగన్మాతను ప్రత్యేకంగా అలంకరించారు. రూపాయి, రెండు, ఐదు, పది,ఇరవై,ఏభై, వంద,రెండొందలు,అయిదొందలు సహా చెలామణిలో ఉన్న నోట్లతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు. అలాగే బ్యాంకుల నుంచి కూడా కొత్త నాణేలు తీసుకొని అలంకరించడం మరో ప్రత్యేకత. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాము ప్రతి ఏడాది కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 30 రోజుల పాటు ముప్పై మంది శ్రమించి ఈ అలంకరణ చేశారు. ఇక గతంలోనూ సంక్రాంతి,విజయదశమి, దీపావళి తదితర వేడుకల్లో అమ్మవారిని వినూత్న రీతిలో అలంకరిస్తూ ఈ ఆలయ కమిటీ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇలా ధనలక్ష్మి అమ్మవారిగా అలంకరించడం అందర్నీ ఆకట్టుకుంది. -
వరలక్ష్మీ వ్రతం ఎవరైనా చేయొచ్చా? పూజా విధానమేంటి?
Varalakshmi Vratham 2023: శ్రావణమాసం అంటేనే పండుగలు, శుభకార్యాలకు ప్రతీకగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం ఉంది. ‘వర’అంటే శ్రేష్ఠమైంది అని అర్థం వస్తుంది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం విశేషాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మహామాయారూపిణి, శ్రీ పీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టయిశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని శ్రావణపూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు. అది శ్రేష్టం కూడా. ఒకవేళ ఏదైనా కారణం వల్ల కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాతి శుక్రవారం చేసుకోవచ్చు. అదీ కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి? శ్రావణమాసంలో అత్యంత విశిష్టంగా భావించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అన్నది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ విధంగా వివరించారు. వరలక్ష్మీ వ్రత కథ : కైలాసగిరిలో పరమేశ్వరుడు తన అనుచర గణములతో, మునిశ్రేష్టులతో కూడియుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది.స్వామీ! ప్రీలు సుఖసౌఖ్యాలను, పుత్రపొత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎటువంటి వ్రతాలను, నోములను ఆచరించాలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నది. పరమేశ్వరుడు సమాధానమిస్తూ 'స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం పూర్తయ్యాక వ్రత కథను వినాలి. వ్రతాన్ని ఆచరించిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ కథను తెలియచేస్తాను అని పరమేశ్వరుడు వ్రత కథను వినిపించాడు. పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణాన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వేకువఝామునే లేచి స్నానమాచరించి పుష్పాలను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల వలె చూచుకుంటూ ఉందేది. గృహకార్యాలన్నీ స్వయంగా తానే చేసుకొనేది. చుట్టుప్రక్కల వారితో, బంధువులతో చనువుగా కలసిమెలసి ఉందేది. చారుమతి సద్దుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది ఒకనాడు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా అన్నది. చారుమతీ! నీ సత్ప్రవర్తనకు, సద్ద్గుణాలకు ప్రసన్నురాలిని అయ్యాను. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయి. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదవికి ప్రదక్షిణాలు చేసి స్తుతించింది. తెల్లవారిన తరువాత భర్త, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. చుట్టుప్రక్కల గల స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని సంతోషించారు. అందరూ కలసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నారు. అందరూ శ్రావణ శుక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొరకు వేచి చూడసాగారు. ఆరోజు చారుమతితో సహా ప్రీలందరూ వేకువ రూమననే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందర గోమయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మంటపంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసింది. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది. ఆనాటి నుంచి ఆనవాయితీగా.. శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోపచార పూజలు గావించింది. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయసాదులను సమర్పించింది. అనంతరం 'ప్రీలందరూ కలసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లు ఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ళవైపు చూసుకుంటే గజ్జెలు, రెండవ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవరత్నఖచిత కంకణాలతో ప్రకాశించసాగాయి. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలంకార భూషణాలతో ప్రకాశించసాగారు. వారి గృహాలన్నీ సకల సంపదలతో సమృద్ధమయ్యాయి. వ్రతం పరిసమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన 'బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోకోపకారం కొరకు చారుమతి అందరిచేత వరలక్ష్మీ వ్రతాన్ని చేయించిందని పౌరులందరూ ఆమెను ప్రశంసించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది. -
Varalaxmi Vratham: మహిళల ప్రత్యేక పూజలు
సాక్షి,ఖమ్మం: శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఈరోజు వీలుకాకపోతే వచ్చే శుక్రవారాల్లో కూడా వ్రతాన్ని ఆచరించవచ్చని అర్చకులు చెబుతున్నారు. ఈ మేరకు మహిళలు పూలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు , వ్రత నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళకరం... ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఆచరించే మహిళలు పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అమరుస్తారు. ఆ తర్వాత వ్రతం ఆచరించి చుట్టుపక్కల మహిళలను పిలిచి వాయినాలు ఇస్తారు. ఇళ్లలో కుదరని వారు దేవాలయాల్లో జరిగే సామూహిక వ్రతాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖమ్మం నగరంలోని పలు ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి అని నమ్మిక. ఏ నియమాలు, మడులు అవసరం లేకుండా నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రతతో ఈ వ్రతం ఆచరించొచ్చని అర్చకులు చెబుతున్నారు. సకల శుభాల కోసమే కాకుండా దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని మహిళలు ఈ వ్రతం ఆచరిస్తుంటారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కొలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే పూజలు చేస్తున్నారు. నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని కూడా ఇంట్లోనే వరలక్ష్మీ వత్రం పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. లక్ష్మీ దేవి అందరి జీవితాల్లోకి ఆనందం, విజయం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ ప్రణీత కూడా అందరికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. -
పూజలోనే మృత్యు ఒడిలోకి..
రాయచోటిటౌన్: ఆమె పూజలో కూ ర్చుంది.. పూజ ప్రారంభమైంది.. అలా కూర్చున్న చోటనే నేలకొరిగింది. ఉదయం నుంచి ఉపవాసం ఉండటంతో నీరసించి ఉంటుందని అక్కడి వారు అం దరూ సపర్యలు చేశారు. కానీ ప్రయోజనం లేదు. అప్పటికే ఆమెను మృత్యువు ఆహ్వానించింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటి డైట్ పాఠశాలలో హిందీ పం డిట్గా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి, రత్నమ్మ (47) దంపతులు పట్టణంలోని గున్నికుంట రోడ్డుకు దగ్గరగా ఉన్న అల్తాఫ్ కల్యాణ మండపం సమీపంలో నివా సం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వారికి వివాహాలు అయ్యాయి. శుక్రవారం రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వేలాది మంది ముత్తయిదువులతో కలసి సామూహిక వరలక్ష్మి వ్రతం చేపట్టారు. ఆ పూజలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని తెల్లవారు జామునే ఇంటిలోని పనులన్నీ పూర్తి చేసి 8గంటలకు ఉపవాసంతో ఆలయానికి చేరుకొంది. ఇంతలో ఒక్కసారిగా ఆమె ముందుకు వాలిపోయింది. ఆమె అనారోగ్యానికి గురై ఉంటుందని భావించి అక్కడి వారు ప్రాథమిక చికిత్స చేశారు. కానీ ఆమె స్పృహ కోల్పోయి పడి ఉండటంతో వెంటనే ఆటోలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె భర్త తమిళనాడులోని తిరుణామళైలో బంధువుల పెళ్లికి వెళ్లి ఉన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. -
10 వేల పట్టుచీర రూ.4 వేలకే : రాష్ట్ర ప్రభుత్వం
కర్ణాటక, మైసూరు : వరమహాలక్ష్మి పండగ సందర్భంగా రూ.10 వేల పట్టుచీర రూ.4 వేలకే ఇవ్వనున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న కూడా సగం ధరలకే మైసూరు పట్టు చీరలను అందించనున్నట్లు పట్టుపరిశ్రమశాఖ మంత్రి సారా మహేశ్ ప్రకటించారు. దీంతో వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా చీరల కోసం మహిళలు నగరంలోని కేఎస్ఐసీ షోరూమ్‌ల ఎదుట బారులు తీరారు. ఆధార్‌కార్డులు, డబ్బులు, పట్టుచీరలు తెచ్చుకోవడానికి సంచులతో ఎంతో ఉత్సాహంతో అక్కడికి వెళ్లిన మహిళలు కొడగు జిల్లాలో చోటుచేసుకున్న ప్రకృతి వైపరిత్యాల కారణంగా పట్టుచీరలపై ప్రకటించిన ఆఫర్ ఉపసంహరించుకున్నామంటూ షోరూమ్‌ల అద్దాలపై అతికించిన నోటీసులు చూసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. రెండు నెలలుగా సగం ధరలకే పట్టుచీరలు ఇస్తామంటూ ఆశలు పెంచి పండుగరోజున చీరల కోసం దుకాణాలకు వెళ్లాక ఇలా ఇవ్వడం కుదరంటూ చెప్పడం ఏమిటంటూ మహిళలు అధికారులపై మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్ణయమని ఈ విషయంలో మేమేమి చేయలేమంటూ అధికారులు స్పష్టం చేయడంతో చేసేదిమి లేక తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ మహిళలు నిరాశగా ఇళ్లముఖం పట్టారు. -
ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ
సందర్భం– నేడు వరలక్ష్మీ వ్రతం అనంతపురం కల్చరల్ : శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు దీర్ఘ సుమంగళీతనం కోసం భర్తతో కలిసి ఆచరించే వరమమాలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎనిమిది విధాల సకల సౌభాగ్యాలనిచ్చే అష్టలక్ష్ములకు మహిళలు పూజిస్తారు. జిల్లాలోని వివిధ ఆలయాలతో పాటు నగరంలోని స్థానిక పాతూరులో వెలసిన ఏకైక మహాలక్ష్మీ ఆలయంలో వ్రత వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండెక్కిన పూల ధరలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా గురువారం సాయంత్రం నుండే నగరంలోని పలు చోట్ల మామిడాకులు, పళ్లు, పూల దుకాణాలు కిటకిటలాడాయి. అన్ని రకాల పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక కేజీ కనకాంబరాలు రూ.150, గులాబీలు రూ.300, మల్లెలు రూ. 130 కాగా చామంతి పూలు రూ. 400 పలుకుతున్నా ప్రజలు పెద్ద ఎత్తున కొంటున్నారు. వరలక్ష్మీ విధానం ఇలా ఆచరిద్దాం.. సాధారణంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజున వీలు కాకపోతే శ్రావణంలో వచ్చే ఏ శుక్రవారమైనా దీనిని ఆచరించుకోవచ్చు. - వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు ఆరోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. - పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. - పసుపు రాసుకున్న తెల్లటి దారాలను ఐదు లేదా తొమ్మిదిపోగులు తీసుకుని తోరాలుగా చేసుకున్న వాటిని చేతికి కట్టుకోవాలి. - తొలుత గణపతి పూజలతో ప్రారంభించి అమ్మవారిని అష్టోత్తర నామాలకు అనుగుణంగా పూజించాలి. - పాలు, పండ్లు, గంధం, వివిధ రకాల పూలను అమ్మవారికి సమర్పించాలి. - దీపారాధనలో అమ్మవారి ప్రతిరూపంగా ఉంటుందని కనుక మహా మంగళహారతి ఇవ్వాలి. - వ్రత కథలను శ్రద్ధగా విన్న తర్వాత ఐదు మంది ముత్తైదువులను పిలిచి చందన తాంబూలిస్తే ఆ ఇంట సిరులొలుకుతాయని అందరి విశ్వాసం. సకల ఐశ్యర్యాలు కలుగుతాయి సహజంగా మహిళలకు పుట్టింటిపై మమకారం ఉంటుంది. ఇదే విషయాన్ని వరలక్ష్మి వ్రతం ప్రతిబింభిస్తుంది. ఈ వ్రతం నిష్టగా జరుపుకునే వారికి పుట్టినింటిలో, మెట్టినింటిలో అపూర్వ ఆదరణ, ఆప్యాయతలు, సకల ఐశ్యర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం. –రమాదేవి, గృహిణి, అనంతపురం -
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
దేవరకద్ర : మండల కేంద్రంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో శుక్రవారం ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వరలక్ష్మీ వ్రతాలకు పలువురు మహిళలు హాజరయ్యారు. వరాలు ఇవ్వమ్మా వరలక్ష్మీదేవీ అంటు మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతాలు నిర్వహించి హారతులు ఇచ్చారు. వేదపండితులు శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలతో చేయించారు. మండల కేంద్రంలోని పలువురు ఆర్య వైశ్య మహిళలు తమ గహాల్లో వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించి ముత్తయిదువలకు పసుపు, కుంకుమ, గాజులు, తాంబులం అందజేసీ దీవెనలు తీసుకున్నారు.