
రాంచీ: సమయానికి అంబులెన్స్ రాక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. గుమ్లా జిల్లాలోని సదర్ ఆస్పత్రిలో సదాన్ దేవి(48) గత నెల 29న చేరారు. అయితే ఆమె పరిస్థితి ఉన్నట్టుండి విషమంగా మారడంతో వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తీస్కెళ్లాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం సూచించారు. బాధితురాలి బంధువులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆమెను రిమ్స్‌కు తరలించినా ఆలస్యం కావడంతో మరణించింది. అంబులెన్స్ డ్రైవర్ ఆలస్యం చేయడమే దీనికి కారణమని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment