Rajendra Institute of Medical Science
-
అంబులెన్స్ ఆలస్యం.. మహిళ మృతి
రాంచీ: సమయానికి అంబులెన్స్ రాక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. గుమ్లా జిల్లాలోని సదర్ ఆస్పత్రిలో సదాన్ దేవి(48) గత నెల 29న చేరారు. అయితే ఆమె పరిస్థితి ఉన్నట్టుండి విషమంగా మారడంతో వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తీస్కెళ్లాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం సూచించారు. బాధితురాలి బంధువులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆమెను రిమ్స్‌కు తరలించినా ఆలస్యం కావడంతో మరణించింది. అంబులెన్స్ డ్రైవర్ ఆలస్యం చేయడమే దీనికి కారణమని వైద్యులు తెలిపారు. -
ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి మృతి!
రాంచీ: ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాంచీ సమీపంలోఎని మండార్ టౌన్ ప్రాంతానికి చెందిన సుజిత్ ముండాను ఉపాధ్యాయుడు అర్సద్ అన్సారీ విచక్షణరహితంగా కొట్టడంతో మరణించాడని విద్యార్థి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన విద్యార్థి రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాంచీకి 40 కిలోమీటర్ల దూరంలోని మండార్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకే మరణించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టమ్ రిపోర్డ్ కోసం చూస్తున్నామని.. ఆతర్వాత మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.