తొండూరు (అనంతపురం) : ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా తొండూరు మండల కేంద్రంలోని హరిజన వాడలో జరిగింది. గ్రామానికి చెందిన జంగమ్మ(53) వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వినాయక నిమజ్జనానికి తరలుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆమె ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి మృతిచెందింది.