నెల్లూరులోని రెయిన్‌బో ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ లిఫ్ట్ నుంచి జారిపడి భాగ్యమ్మ(50) అనే మహిళ మృతిచెందింది.
నెల్లూరు : నెల్లూరులోని రెయిన్‌బో ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ లిఫ్ట్ నుంచి జారిపడి భాగ్యమ్మ(50) అనే మహిళ మృతిచెందింది. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతరాలి స్వగ్రామం అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి.