మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని షేక్ పేట్ ప్రాంతంలో ఓ మహిళ బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాల ప్రకారం.. షేక్‌పేట లేబర్ కాలనీకి చెందిన భారతి (34) శనివారం ఓ ఇంటిలో పనిచేసేందుకు వెళ్లింది. బట్టలు ఉతికిన అనంతరం మేడపై ఆరేస్తుండగా అవి వెళ్లి సమీపంలోని విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.