హైదరాబాద్‌సిటీ: చాంద్రాయణగుట్టపరిధిలోని ఫలక్‌నూమా బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఓ గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళ దగ్గర ఓ సెల్‌ఫోన్, ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య చేసిన అనంతరం బ్రిడ్జి వద్ద పడవేసి ఉంటారని తెలుస్తుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.