తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం
యాదాద్రి జిల్లాకు చెందిన ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వైన్ ఫ్లూతో మృతి చెందింది.
హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వైన్ ఫ్లూతో మృతి చెందింది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరికి స్వైన్ ప్లూ ఉన్నట్లు నిర్థారణ అయింది. కాగా గత ఆరు నెలల కాలంలో ఇప్పటివరకూ ఆరుగురు మృత్యువాత పడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా 112 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో జనం భయాందోళన చెందుతున్నారు. శీతాకాలం కావడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు చెప్తున్నారు. తీవ్రమైన జలుబు, జ్వరంతోపాటు కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడుతున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.