హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్ ఫ్లూ మృతి నమోదైంది. బాలానగర్‌కు చెందిన రెహమాన్(62) స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యసేవల కోసం శనివారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గాంధీలో స్వైన్‌ఫ్లూతో 66 మంది మృతిచెందారు. గాంధీలో ప్రస్తుతం నలుగురు స్వైన్‌ఫ్లూ బాధితులు, 23మంది అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని నోడల్ అధికారి నర్సింహులు తెలిపారు.