పాల్వంచ: ఖమ్మం జిల్లాలో భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రమీల(32) అనే మహిళ చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి మరణించింది.
పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ప్రమీల, చందు భార్యాభర్తలు. చందు పాల్వంచ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రమీల ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రగాయాలైన ప్రమీలను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.