►పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా డాల్టా లేదా నూనె వేయాలి.
►నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్ అడుగున వేసి రుద్దితే నలుపు తగ్గుతుంది. దుర్వాసన దూరం అవుతుంది.
►పచ్చిమిరపకాయల తొడిమలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి త్వరగా పాడవవు.
►నూనె ఒలికితే ఆ ప్రాంతంలో కొద్దిగా మైదాపిండి చల్లాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది.
►క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి.
►కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
►కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్ప వేసి నిల్వ ఉంచితే పప్పు త్వరగా పాడవదు.
►మిక్సీ, అవెన్, ఫ్రిజ్.. వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భాగం జిడ్డుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది.
►షూస్, స్నీకర్స్ లోపలి వైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్ సోడా లోపలి వైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు.
►చెక్క ఫర్నీచర్ మీద మరకలు తొలగించాలంటే టూత్‌పేస్ట్ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి.
►పిల్లలు కలర్ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్ సోడా చల్లి, తడి స్పాంజ్‌తో తుడవాలి.
►నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది.
►వేడి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి వాటర్ బాటిల్స్‌ను రెండు రోజుల కొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు.
ఇంటిప్స్
Published Thu, May 16 2019 12:03 AM | Last Updated on Thu, May 16 2019 12:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment