Sweet Recipes In Telugu: How To Prepare Kismis Doughnuts Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Kismis Doughnuts: మైదాపిండి, పంచదార..  కిస్మిస్‌ డోనట్స్‌ తయారు చేసుకోండిలా!

Published Wed, Nov 16 2022 4:01 PM | Last Updated on Wed, Nov 16 2022 4:55 PM

Sweet Recipes In Telugu: How To Prepare Kismis Doughnuts - Sakshi

రొటీన్‌ స్వీట్స్‌ బోర్‌ కొడితే మైదాపిండితో కిస్మిస్‌ డోనట్స్‌ తయారు చేసుకోండిలా!
కావలసినవి:  
►మైదాపిండి – 2 కప్పులు
►పంచదార పొడి – 1 కప్పు
►వైట్‌ వెనిగర్, వెనీలా ఎసెన్స్‌

►బేకింగ్‌ సోడా – 1 టీ స్పూన్‌  చొప్పున
►ఉప్పు – అర టీ స్పూన్‌
►మజ్జిగ – ముప్పావు కప్పు

►గుడ్లు – 2
►కిస్మిస్‌ – 1 కప్పు (నానబెట్టి మిక్సీ పట్టి, మెత్తటి గుజ్జులా చేసుకోవాలి)
►నూనె – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ:
►ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి.
►అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్‌ సోడా, మజ్జిగ, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్‌ వెనిగర్, కిస్మిస్‌ గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.
►డోనట్స్‌ మేకర్‌కి కొద్దిగా నూనె పూసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకోవాలి
►ఓవెన్‌లో వాటిని బేక్‌ చేసుకోవాలి.
►అభిరుచిని బట్టి చాక్లెట్స్‌ క్రీమ్, డ్రైఫ్రూట్స్‌తో నచ్చిన విధంగా గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో మరమరాల పకోడా!
Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement