
తీరైన కనుబొమ్మలు,... జాలు వారే కురులు.. రాజసం ఉట్టిపడే వస్త్రధారణ.. కలిగిన ఈ ఫోటోలోని బొమ్మను చూస్తే ఓహో అనాల్సిందే! కానీ దీన్ని బొమ్మ అనుకుంటే మీరు పొరబడినట్టే! అందమైన ఈ బొమ్మ ‘‘కేకు’’ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.! చైనాకు చెందిన జోయీ అనే వ్యక్తి వీటిని ఇలా అద్భుతంగా తయారు చేస్తాడు. చైనాలోనే ది బెస్ట్ కేకులు తయారు చేసే వ్యక్తిగా జోయీకి పేరుంది. తయారీలో అంతర్జాతీయ కేకు పోటీల్లో మూడు బంగారు, రెండు కాంస్య పతకాలు కూడా దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment