మైదాతో కాకుండా సజ్జపిండితో ఇలా కేక్ తయారు చేసుకోండి! ఎంచక్కా క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలను పెర్ల్ మిల్లెట్ కేక్‌తో ఆస్వాదించండి.
కావలసినవి:
►సజ్జ పిండి– వంద గ్రాములు
►చక్కెర – 80 గ్రాములు
►పాలు – 30 ఎమ్‌ఎల్
►కోడిగుడ్లు – 3
►వెనిలా ఎసెన్స్– 2 చుక్కలు
►వెన్న – టీ స్పూన్
తయారీ:
►సజ్జలను మందపాటి పెనంలో దోరగా వేయించి, చల్లారిన తరవాత మెత్తగా పొడి చేసి జల్లెడ పట్టి పక్కన ఉంచుకోవాలి.
►ఒవెన్‌లో పెట్టే పాత్రకు వెన్న రాసి సిద్ధంగా ఉంచుకోవాలి.
►వెడల్పుగా లోతుగా ఉండే పాత్రలో కోడిగుడ్ల సొన వేసి బీటర్‌తో నురగ వచ్చే వరకు బీట్ చేయాలి.
►ఇప్పుడు అందులో చక్కెర వేసి మరికొంత సేపు గిలక్కొట్టాలి.
►సజ్జ పిండిని జల్లెడలో వేసి కోడిగుడ్ల మిశ్రమం ఉన్న పాత్రలో జల్లించినట్లు వేయాలి.
►ఇలా చేస్తే పిండి ఉండలు లేకుండా సమంగా కలుస్తుంది. పాలు, వెనిలా ఎసెన్స్ కూడా వేసి సమంగా కలిసే వరకు బీట్ చేయాలి.
►బీట్ చేయడం తగ్గిస్తే కేక్ సరిగా పొంగదు.
►కాబట్టి పిండి మిశ్రమాన్ని గుల్లబారే వరకు బీట్ చేయాలి.
►బాగా కలిసిన కేక్ మిశ్రమాన్ని వెన్నరాసిన కేక్ మౌల్డ్ లేదా మామూలు పాత్రలో పోసి ఒవెన్‌ను 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి అందులో పెట్టాలి.
►అర గంట సేపటికి చక్కగా బేక్ అవుతుంది.
►టూత్ పిక్‌తో కేక్ పై నుంచి గుచ్చి బయటకు తీసి చూస్తే తేమ అంటకపోతే మిశ్రమం పూర్తిగా బేక్ అయినట్లు, తేమ ఉన్నట్లనిపిస్తే మరో ఐదు నిమిషాల సేపు ఉంచాలి. ►కేక్‌ను ఒవెన్ నుంచి తీసి వేడి తగ్గిన తరవాత ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.
►ఇష్టమైన వాళ్లు కేక్ మీద ఐసింగ్ షుగర్‌తో డెకరేట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment